Ys Jagan : స్టార్ హీరోలు రావాల్సిందేనని వైయస్ జగన్ పంతం.. నారాయణ మూర్తి మాటలే సాక్ష్యం
Ys Jagan : ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు మరియు ప్రభాస్ లు భేటీ కి హాజరు కావడం చర్చనీయాంశమైంది. మొదటి నుండి చిరంజీవి టిక్కెట్ల రేట్లపై విషయం లో జగన్ తో చర్చలు జరుపుతున్నాడు కనుక ఆయన వెళ్లడం ఆశ్చర్యం లేదు. కానీ ప్రభాస్ మరియు మహేష్ బాబు లు వెళ్లడం ఆసక్తిగా మారింది. వీరిద్దరితో పాటు ఎన్టీఆర్ కూడా రావాలంటూ చిరంజీవి ఆహ్వానించాడట కానీ చిరంజీవి ఆహ్వానాన్ని సున్నితంగా ఎన్టీఆర్ తిరస్కరించాలని సమాచారం అందుతుంది.టికెట్ల విషయం లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు వెళ్లి సీఎం జగన్ తో మాట్లాడకుండా స్టార్ హీరోలు వెళ్లి మాట్లాడడం ఏంటి
అంటూ ఒకింత అనుమానం మరియు ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. ఇదే సమయంలో కొందరు ఏపీ సీఎం జగన్ మరియు వైకాపా నాయకులు పట్టు బట్టి మరీ తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన పెద్ద కుటుంబాల నుంచి హీరోలు రావాలని డిమాండ్ చేశారట. నందమూరి ఫ్యామిలీ నుండి ఒకరు ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇంకా కొంత మంది స్టార్ హీరోలు కూడా భేటీకి రావాలని మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవి తో అన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే చిరంజీవి స్టార్ హీరోలందరికి కూడా స్వయంగా ఫోన్ చేసి జగన్ తో భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించాడని సమాచారం.ఆ వార్తలు నిజమే అన్నట్లుగా తాజాగా ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడిన సందర్భంగా క్లారిటీ వచ్చింది.
ఇలా హీరోలను మాత్రమే కాకుండా నిర్మాతల మండలి సభ్యులను మరియు ఇతర క్రాప్ట్ ల వారిని కూడా పిలిచి టిక్కెట్ రేట్ల విషయమై చర్చించి ఉంటే బాగుండేది మంత్రి గారు అంటూ నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేసిన సమయంలో పేర్ని నాని స్పందిస్తూ.. ఇప్పటికే నిర్మాతల మండలి తో చర్చించాము. హీరోలు స్వయంగా వస్తామంటే మేము కాదనలేదు. మేము వారిని ఆహ్వానించ లేదు అన్నట్లుగా బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ పరిస్థితిని చూస్తే వైయస్ జగన్ మరియు వైకాపా నాయకులు పంతంతో స్టార్ హీరో లను అమరావతి రప్పించు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా ఏ స్టార్ హీరో కూడా అమరావతి వెళ్ళింది లేదు. సీఎం జగన్మోహన్ ని కలిసింది లేదు అందుకే ఇలా చేశారు అంటూ కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం అనేది తెలియాల్సి ఉంది.