YS Jagan : తెలుగుదేశంలో సెకండ్ లెవెల్ క్యాడర్ మొత్తం వైఎస్ జగన్ వెంట నిలబడుతోంది.. చరిత్ర మరచిపోలేని రాజకీయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : తెలుగుదేశంలో సెకండ్ లెవెల్ క్యాడర్ మొత్తం వైఎస్ జగన్ వెంట నిలబడుతోంది.. చరిత్ర మరచిపోలేని రాజకీయం..!

 Authored By kranthi | The Telugu News | Updated on :1 November 2022,2:20 pm

YS Jagan : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పార్టీ చూస్తోంది. గెలుపంటే అలాంటి ఇలాంటి గెలుపు కదా. ఏదో గెలవడం కాదు. కొడితే అన్ని వికెట్లు పడిపోవాలి అంతే. ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు అన్ని నియోజకవర్గాలు గెలవాలి. అదే ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్. 175 సీట్లకు 175 సీట్లు గెలవాలన్నమాట. మరి.. అన్ని సీట్లు గెలవాలంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాలి. క్యాడర్ మొత్తాన్ని పటిష్ట పరచాలి. అందరు నేతలను సమన్వయం చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచాలి. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని కూడా అందుకే వైఎస్ జగన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నారు సీఎం జగన్. పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లోనే కాదు.. గెలవని నియోజకవర్గాల్లోనూ సీఎం జగన్ సర్వేలు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నారు. ప్రతి నెలా నివేదికలు తెప్పించుకొని ప్రతి నియోజకవర్గాన్ని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ గెలిచిన ఆ 23 నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట జగన్. ఆ 23 మందిలో ప్రస్తుతం టీడీపీతో ఉన్నది 19 మందే. నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో లేరు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల బలం ఏంటి.. బలహీనత ఏంటి.. అనే కోణంలో వైఎస్ జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ys jagan concentrating on tdp second grade leadership

ys jagan concentrating on tdp second grade leadership

YS Jagan : ద్వితీయ శ్రేణి నేతలపై దృష్టి పెంచిన సీఎం జగన్

ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలవాలంటే కేవలం వైసీపీ గెలిచిన నియోజకవర్గాల మీద మాత్రమే కాదు.. వైసీపీ గెలవని నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ కు అర్థం అయింది. అందుకే.. అన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టడమే కాదు.. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపై కూడా సీఎం జగన్ దృష్టి పెట్టారు. అలాంటి నేతలను వెంటనే వైసీపీలో చేర్చుకునేందుకు పక్కా పథకాన్ని రచిస్తున్నారు. చూద్దాం మరి.. వచ్చే ఎన్నికల వరకు జగన్ ఇంకా ఎలాంటి ప్లాన్స్ వేస్తారో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది