YS Jagan : వైయస్ జగన్ కి ఉన్నది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
YS Jagan : 2024 అసెంబ్లీ ఎన్నికల విషయంలో వైకాపా అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆయనది కాన్ఫిడెన్స్ మాత్రమే ఓవర్ కాన్ఫిడెన్స్ అసలే కాదు అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గ విశ్లేషణలు కూడా వారు ఇస్తున్నారు. ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజక వర్గానికి కూడా గెలుచుకుందాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎక్కడైతే మెజారిటీ సీట్ల ను తెలుగుదేశం పార్టీ దక్కించుకుందో అక్కడ వైకాపా ఫోకస్ పెట్టడం జరుగుతుందని అన్నాడు.విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో టీడీపీ ఎక్కువ సీట్లను దక్కించుకుంది.
ఇప్పుడు అక్కడ ప్రధానంగా జగన్ దృష్టి పెట్టడం కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బలమున్న చోట.. కంచుకోట అనుకున్న చోట దృష్టి పెట్టి అక్కడ మరింతగా అభివృద్ధి సాధించి మరో సారి అక్కడ విజయాన్ని సొంతం చేసుకోవాలి.. సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలి, అంతే తప్ప బలం లేని చోట.. బలగం లేని చోట పోటీ చేసి గెలుపొందే ప్రయత్నం చేయడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు దేశంలోని ముఖ్యమంత్రిగా సాధించిన ప్రగతి ప్రతిపక్షం బలంగా ఉన్న ప్రాంతంలో అధికార పార్టీకి ఈ అవకాశాన్ని దక్కేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan Confidence or overconfidence
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సాధించిన సీట్లపై జగన్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు తో సహా ప్రతి ఒక్క తెలుగు దేశం పార్టీ గెలిచిన సీట్లలో కూడా పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా మరోసారి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు జనాల్లోకి తీసుకు వెళ్తే ఓట్లు వేస్తారు అనే నమ్మకంతో ఉన్నారను. ఆయన చెయ్యని పని కి ఓట్లు అడగడం లేదని.. కనుక ఆయనది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.