Ys Jaga : ఆ వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన వైఎస్ జగన్..!
Ys Jaga కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి nandyal mla Silpa Ravi Chandra Kishore Reddy కి వైసీపీ Ysrcp అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. తన భార్య శిల్పా నాగిని రెడ్డిని ఎలాగైనా వైస్ చైర్‌పర్సన్‌గా చూడాలనుకున్న ఎమ్మెల్యే కలలను వైసీపీ అధిష్టానం కల్లలు చేసింది. దీంతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారని సమాచారం. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో రెండో వైస్ చైర్మన్ పదవిని వైఎస్ జగన్ Ys Jaga ప్రభుత్వం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Ys jagan
రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చైర్మన్ పదవి ఆశించిన వాళ్లకు రెండో పదవిపై కన్ను పడింది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ఆశతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తన సతీమణి శిల్పా నాగినిరెడ్డి Silpa Ravi Chandra Kishore Reddy ని 36వ వార్డు నుంచి ఎన్నికయ్యేలా చూసుకున్నారు. దీంతో రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె పావులు కదిపారు. అయితే వీరి ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది. దీంతో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నొచ్చుకున్నారని టాక్ వినిపిస్తోంది.
కీ రోల్ లో శిల్పా నాగిరెడ్డి.. Ysjagan

Silpa Ravi Chandra Kishore Reddy
శిల్పా నాగినిరెడ్డి రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అని పేరు తెచ్చుకున్నారు. ప్రజాసేవ చేయాలనే తపన ఆమె మాటల్లో, చేతల్లో కనిపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిలో ఉంటే నంద్యాల వాసులకు మరింత చేరువ కావచ్చని ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య భావించారు. అయితే తామొకటి తలస్తే …వైసీపీ అధిష్టానం మరో రకంగా ఆలోచించింది. చైర్‌పర్సన్ పదవిని ముస్లింలకు కేటాయించింది. దీంతో నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి మాబున్నీసాను వరించింది. కనీసం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవైనా దక్కుతుందని నాగినిరెడ్డి భావించారు. ఆ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించడంతో వాసగిరి విజయభాస్కర్‌ను ఎన్నుకోవాల్సి వచ్చింది. రెండో వైస్ చైర్‌పర్సన్ పదవి ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చిందని సమాచారం. తాజాగా సామాజిక సమీకరణల్లో భాగంగా ఆ పదవిని కూడా ఇవ్వలేమని ఎమ్మెల్యేకు అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏం చేస్తారన్న చర్చ నియోజకవర్గంలో సర్వత్రా వినిపిస్తోంది.