YS Jagan : అంతా ఓకే కానీ.. జగన్ కు దెబ్బపడేది అక్కడే.. ఫోకస్ మార్చకపోతే అంతే సంగతులు
YS Jagan : ఏపీలోనే కాదు.. ఎక్కడైనా సరే.. ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే గ్రామీణ ఓటర్లదే తుదినిర్ణయం. గ్రామీణ ఓటర్లు ఎటువైపు నిలబడితే వాళ్లదే అధికారం. ఎందుకంటే అర్బన్ ఓటర్లు పెద్దగా పోలింగ్ లో పాల్గొనరు. పాల్గొన్నా వాళ్ల ఓటు ఎటువైపు పడుతుందో చివరి వరకు క్లారిటీ ఉండదు. అందుకే.. అర్బన్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పోలింగ్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయితే.. అర్బన్ ప్రాంతాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాదు. అందుకే.. ఎవరైనా గెలవాలంటే గ్రామీణ ఓటర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. నిజానికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల మీదనే ఫోకస్ పెట్టారు.
పేద, గ్రామీణ ప్రజల కోసమే ఆయన పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అందుకే.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఎలాంటి సమస్య లేదు. వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ గానే ఉందని నమ్ముతున్నారు. కానీ.. అర్బన్ ప్రాంతాల సంగతి ఏంటి? అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ చాలా వీక్ గా ఉంది. జగన్ ప్రవేశపెట్టే ఎలాంటి పథకం అయినా చివరకు గ్రామీణ ప్రాంతాలకే ఉపయోగపడుతుంది కానీ.. అర్బన్ ఓటర్లకు ఎలాంటి ఉపయోగం లేదు. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు వెచ్చించినా కూడా అభివృద్ధి కుంటుపడటంతో అర్బన్ ఓటర్లు జగన్ మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క ప్రజలు మాత్రమే కాదు.. ఉద్యోగ వర్గాలు, ఇతర వర్గాలు కూడా వైసీపీ పాలనపై అసంతృప్తితో ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
YS Jagan : కొత్త జిల్లాల ఏర్పాటు జగన్ కు మైలేజ్ పెంచాయి
జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకోకపోయినా.. ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మాత్రం జగన్ కు మైలేజ్ ను తీసుకొచ్చింది. జిల్లా కేంద్రాలు, జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తే అర్బన్ ప్రాంతాల్లో వైసీపీకి కాస్తో కూస్తో మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే.. ఇది సరిపోదు. అర్బన్ ప్రాంతాల్లో ఇంకా యాక్టివ్ కావాలి.. ఫోకస్ పెంచాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పలు సర్వేలలోనూ అర్బన్ ప్రాంతాల్లోనే పార్టీ వీక్ గా ఉందనే నివేదికలు అందాయి. అందుకే అర్బన్ ప్రాంతాలపై జగన్ ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు ఎలాగూ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక వచ్చే రెండేళ్లు అర్బన్ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఇప్పటి నుంచే సీఎం జగన్ అన్ని జిల్లాల పర్యటనలను కూడా ప్రారంభించారు.