YS Jagan : ఇద్దరికీ పడకున్నా.. కేసీఆర్ ను ఆ విషయంలో గుడ్డిగా జగన్ ఎందుకు ఫాలో అవుతున్నట్టు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఇద్దరికీ పడకున్నా.. కేసీఆర్ ను ఆ విషయంలో గుడ్డిగా జగన్ ఎందుకు ఫాలో అవుతున్నట్టు?

 Authored By sukanya | The Telugu News | Updated on :25 September 2021,4:00 pm

YS Jagan : తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే డిసెంబర్ నుండి వార్డు, గ్రామ సచివాలయాలను తాను పర్సనల్ గా సందర్శిస్తానని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన జగన్ డిసెంబర్ నుండి రెగ్యులర్ గా తాను సందర్శించడమే కాక జిల్లా అదికారులను సందర్శించాలని ఆదేశించారు. అలాగే నెలకు 4 సచివాలయాల్ని సందర్శించి, అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్నిబట్టి జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రిపేర్ అయిపోతున్నారన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఈ సందర్శన పేరిట ఎమ్మెల్యేలు సైతం జనాల్లోకి చొచ్చుకుపోవాలని ఆదేశించినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయన్న మాట జనాల్లోకి బాగా వెళ్లింది.. తమకు ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరుల బాధ తప్పిందన్న హ్యాపీనెస్ ప్రజల్లోనూ వ్యక్తమమవుతోంది. దీన్ని ఓట్లుగా మార్చుకునే పనిలో ఇప్పుడు జగన్ దిగారన్న ఆలోచన సర్వత్రా వినిపిస్తోంది.

Ys jagan following on kcr

Ys jagan following on kcr


YS Jagan : ఎమ్మెల్యేలకు పని..


ఇక వచ్చే ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్న ఎమ్మెల్యేలు .. ఇప్పటి నుంచి సచివాలయ వ్యవస్థను ఫాలో చేస్తే, అక్కడ ఉన్న చిన్నా చితకా సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చని, దీనివల్ల మరింత పేరు తెచ్చుకోవచ్చని సీఎం జగన్ ప్లాన్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి పని లేకుండా పోయిన ఎమ్మెల్యేలకు చేతినిండా పని మాత్రమే కల్పించి, ఎన్నికల్లో పనికివస్తారో లేదో తేల్చుకోవాలన్నది కూడా వైఎస్ జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు వస్తారంటే, వారితో పాటు కచ్చితంగా అధికారులు కూడా దిగాల్సి ఉంటుంది.. ఇక తనతో సంబంధం లేకుండానే కలెక్టర్లు, ఎస్పీలు, జాయిట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవో అందరినీ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారంటేనే కారణం అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలవటానికి వైఎస్ జగన్ దగ్గరున్న తురుపుముక్కల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధ కూడా ఒకటి.

Ys jagan following on kcr

Ys jagan following on kcr

YS Jagan : ముందస్తు ..

Ys jagan following on kcr

Ys jagan following on kcr


వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న నవరత్నాల పథకాల అమలు విషయంలో వాలంటీర్లదే కీలకమైన పాత్ర. వీళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఈమధ్య జరిగిన క్యాబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే నిజమైతే డిసెంబర్ నుండి సచివాలయాలను వ్యక్తిగతంగా సందర్శించటం వ్యూహాత్మకమనే చెప్పాలి. మరోవైపు పీకే టీం కూడా తెరంగేట్రం చేయనుందన్న వార్తల దరిమిలా .. అన్నీ కలిసివస్తే, వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్నది ఓ అంచనా గా విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా విపక్షాలకు చెక్ చెప్పవచ్చని, సచివాలయ సందర్శనతో ఎమ్మెల్యేలు కూడా పనిలోకి దిగుతుండడంతో, గెలుపు సులువు అవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నారట.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది