Breaking : పోసానికి కూడా పదవి కట్టబెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం..!!
Breaking : 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్న సినిమా సెలబ్రిటీలకు తాజాగా జగన్ ప్రభుత్వం పదవులు కట్టబెడుతూ ఉంది. మొన్ననే నటుడు ఆలీకి ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పదవి అప్పజెప్పడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళికి చైర్మన్ ఆఫ్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. రాజకీయంగా వైఎస్ జగన్ కి మొదటి నుండి పోసాని కృష్ణ మురళి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా వైయస్ జగన్ పై వస్తున్న విమర్శలను అనేకసార్లు పోసాని డిఫెండ్ చేయడం జరిగింది.

YS Jagan government has given post to Posani Krishna Murali
వైయస్ జగన్ పాదయాత్రలో కూడా పోసాని కృష్ణ మురళి పాల్గొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో రావడంలో పోసాని కృష్ణమురళి తనవంతు కృషి చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో పోసాని కృష్ణ మురళికి చైర్మన్ ఆఫ్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి.. జగన్ ప్రభుత్వం కట్టబెట్టడం రాజకీయంగా సినిమా పరంగా సంచలనం సృష్టించింది.