YS Jagan : ఏపీ సర్కారు ముందు చూపు.. విద్యుత్తుపై ‘త్రిశూల’ సూత్రం.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఏపీ సర్కారు ముందు చూపు.. విద్యుత్తుపై ‘త్రిశూల’ సూత్రం.!

YS Jagan : గాలి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు. నీటి ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సూర్య కాంతి నుంచి కూడా విద్యుత్తుని తయారు చేయొచ్చు. కానీ, ఈ మూడూ ఒకే చోట సాధ్యమే.? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సుసాధ్యం చేస్తోంది. గ్రీన్ కో గ్రూప్ ద్వారా ఏకంగా 5,230 మెగావాట్ల సామర్థ్యంలో ఓ బృహత్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఒకే చోట మూడు మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్, ప్రపంచంలో ఇదే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 May 2022,11:00 am

YS Jagan : గాలి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు. నీటి ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సూర్య కాంతి నుంచి కూడా విద్యుత్తుని తయారు చేయొచ్చు. కానీ, ఈ మూడూ ఒకే చోట సాధ్యమే.? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సుసాధ్యం చేస్తోంది. గ్రీన్ కో గ్రూప్ ద్వారా ఏకంగా 5,230 మెగావాట్ల సామర్థ్యంలో ఓ బృహత్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఒకే చోట మూడు మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్, ప్రపంచంలో ఇదే అతి పెద్దదని నిపుణులు చెబుతున్నారు. పంప్ స్టోరేజ్ 1,690 మెగా వాట్లు, 3 వేల మెగా వాట్ల సోలార్, 550 మెగా వాట్ల విండ్ పవర్ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని పిన్నాపురలో గ్రీన్ గ్రూపు ద్వారా ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం.

దేశంలోనే ఈ తరహా, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేవలం ఒక్క టీఎంసీ నీటితోనే ఇంత పెద్దయెత్తున విద్యుత్తుని ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుండడం గమనార్హం. వేర్వేరు ఎత్తుల్లో రిజర్వాయర్లు నిర్మిస్తారు జల విద్యుత్ కోసం. అవసరానికి తగ్గట్టుగా నీటిని ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు పంపింగ్ చేయడం, లేదంటే దిగువకు వదలడం చేస్తారు. పవన విద్యుత్.. అదేనండీ విండ్ పవర్ విషయానికొస్తే, ఇది కూడా అత్యంత చవకైనదే. గాలికి కొదవేముంది.? ఆ గాలి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి, పగలు అన్న తేడాల్లేవ్ పవన విద్యుత్తు ఉత్పత్తికి. సౌర విద్యుత్తు కేవలం పగటి పూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సూర్య కాంతిని ఓ గంట పాటు ఒడిసి పట్టగలిగితే, అది ప్రపంచానికి ఓ సంవత్సరం పాటు విద్యుత్తుని అందిస్తుందని చెబుతుంటారు.

Ys Jagan Govt'Trishul' Mantra For Electricity

Ys Jagan Govt ‘Trishul’ Mantra For Electricity

అంత శక్తి వుంది సూర్య కాంతిలో. సోలార్ ప్యానళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.బొగ్గు, సహజ వాయువు, ఇతర శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.. ఆయా వనరుల లభ్యత కూడా తగ్గుతోంది.. దానికి తోడు ఖర్చు కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం కొత్త మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి వైపు దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రీన్ కో సంస్థ ద్వారా మూడు మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి ఒకే చోట జరిగేలా బృహత్ కార్యక్రమం ప్రారంభించింది. దీన్ని విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి త్రిశూల సూత్రమని అనొచ్చేమో.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ ఎంత గొప్పదో ఈ ప్రాజెక్టు ప్రారంభం చెప్పకనే చెబుతోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది