YS Jagan : గాలి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు. నీటి ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సూర్య కాంతి నుంచి కూడా విద్యుత్తుని తయారు చేయొచ్చు. కానీ, ఈ మూడూ ఒకే చోట సాధ్యమే.? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సుసాధ్యం చేస్తోంది. గ్రీన్ కో గ్రూప్ ద్వారా ఏకంగా 5,230 మెగావాట్ల సామర్థ్యంలో ఓ బృహత్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఒకే చోట మూడు మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్, ప్రపంచంలో ఇదే అతి పెద్దదని నిపుణులు చెబుతున్నారు. పంప్ స్టోరేజ్ 1,690 మెగా వాట్లు, 3 వేల మెగా వాట్ల సోలార్, 550 మెగా వాట్ల విండ్ పవర్ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని పిన్నాపురలో గ్రీన్ గ్రూపు ద్వారా ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
దేశంలోనే ఈ తరహా, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేవలం ఒక్క టీఎంసీ నీటితోనే ఇంత పెద్దయెత్తున విద్యుత్తుని ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుండడం గమనార్హం. వేర్వేరు ఎత్తుల్లో రిజర్వాయర్లు నిర్మిస్తారు జల విద్యుత్ కోసం. అవసరానికి తగ్గట్టుగా నీటిని ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు పంపింగ్ చేయడం, లేదంటే దిగువకు వదలడం చేస్తారు. పవన విద్యుత్.. అదేనండీ విండ్ పవర్ విషయానికొస్తే, ఇది కూడా అత్యంత చవకైనదే. గాలికి కొదవేముంది.? ఆ గాలి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి, పగలు అన్న తేడాల్లేవ్ పవన విద్యుత్తు ఉత్పత్తికి. సౌర విద్యుత్తు కేవలం పగటి పూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సూర్య కాంతిని ఓ గంట పాటు ఒడిసి పట్టగలిగితే, అది ప్రపంచానికి ఓ సంవత్సరం పాటు విద్యుత్తుని అందిస్తుందని చెబుతుంటారు.
అంత శక్తి వుంది సూర్య కాంతిలో. సోలార్ ప్యానళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.బొగ్గు, సహజ వాయువు, ఇతర శిలాజ ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.. ఆయా వనరుల లభ్యత కూడా తగ్గుతోంది.. దానికి తోడు ఖర్చు కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం కొత్త మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి వైపు దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రీన్ కో సంస్థ ద్వారా మూడు మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి ఒకే చోట జరిగేలా బృహత్ కార్యక్రమం ప్రారంభించింది. దీన్ని విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి త్రిశూల సూత్రమని అనొచ్చేమో.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ ఎంత గొప్పదో ఈ ప్రాజెక్టు ప్రారంభం చెప్పకనే చెబుతోంది.
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.