YS jagan ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ అందులో యాక్టీవ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు అతి కొద్దీ మంది మాత్రమే అని తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ప్రళయం సృష్టిస్తున్న ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ బాగోగులు చూసుకున్న నేతలు, సెకండ్ వేవ్ లో మాత్రం ఎక్కడ కనిపించటం లేదు.
ఇలాంటి సమయంలో వైసీపీ తరుపున ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు చేస్తున్న పనులు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా కవర్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆయా నేతల గురించి తెలుసుకోవాల్సిందే.. అందులో ఒకరు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాడు. కొన్ని కల్యాణ మండపాలను తీసుకోని, అక్కడే సొంతగా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.సింహాద్రి రమేష్‌బాబు తన నియోజకవర్గంలో వంద పడకలతో ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించారు. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సైతం మానిటరింగ్ చేస్తున్నారు. ఆక్సిజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. కరోనా బాధితులు కోలుకునేలా చేస్తున్నారు.
అదే విధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. కొందరికి రూ.1000 చొప్పున రమేష్‌బాబు అందిస్తున్నారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు మార్మోగుతోంది. కరోనా మొదటి వేవ్ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనితో ఆ ఇద్దరు పేర్లు సీఎం జగన్ దగ్గరకు చేరుకోవటంతో, స్వయంగా జగన్ వాళ్లకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరినీ చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఏమైనా ముందుకు కదులుతారో లేదో చూడాలి
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.