150 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరి పైన జగన్ స్పెషల్ ఫోకస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

150 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరి పైన జగన్ స్పెషల్ ఫోకస్

 Authored By brahma | The Telugu News | Updated on :27 May 2021,9:50 am

YS jagan ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ అందులో యాక్టీవ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు అతి కొద్దీ మంది మాత్రమే అని తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ప్రళయం సృష్టిస్తున్న ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ బాగోగులు చూసుకున్న నేతలు, సెకండ్ వేవ్ లో మాత్రం ఎక్కడ కనిపించటం లేదు.

Ys jagan has a special focus on those two mlas

Ys jagan has a special focus on those two mlas

150 మందికి ఆ ఇద్దరే

ఇలాంటి సమయంలో వైసీపీ తరుపున ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు చేస్తున్న పనులు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా కవర్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆయా నేతల గురించి తెలుసుకోవాల్సిందే.. అందులో ఒకరు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ బాబు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి.

Ramesh Babu Simhadri

ఒకరిని మించి మరొకరు

ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాడు. కొన్ని కల్యాణ మండపాలను తీసుకోని, అక్కడే సొంతగా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నారు.సింహాద్రి ర‌మేష్‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వంద ప‌డ‌క‌ల‌తో ప్రత్యేకంగా ఆసుప‌త్రిని నిర్మించారు. అదే స‌మ‌యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాన్ని సైతం మానిట‌రింగ్ చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. క‌రోనా బాధితులు కోలుకునేలా చేస్తున్నారు.

Chevireddy Bhaskar Reddy | ElectWise

అదే విధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. కొంద‌రికి రూ.1000 చొప్పున ర‌మేష్‌బాబు అందిస్తున్నారు. దీంతో అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వర్గంలో ఎమ్మెల్యే పేరు మార్మోగుతోంది. కరోనా మొదటి వేవ్ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనితో ఆ ఇద్దరు పేర్లు సీఎం జగన్ దగ్గరకు చేరుకోవటంతో, స్వయంగా జగన్ వాళ్లకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరినీ చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఏమైనా ముందుకు కదులుతారో లేదో చూడాలి

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది