YS Jagan : ఎవరిని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మేయకు జగనన్న.. ఇప్పుడు చూడు ఏమైందో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఎవరిని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మేయకు జగనన్న.. ఇప్పుడు చూడు ఏమైందో?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 May 2021,6:03 pm

YS Jagan : రాజకీయాలంటే అంతే. ఎవ్వరినీ నమ్మకూడదు. వెనుకనే ఉంటూ వెన్నుపోటు పొడిచేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ.. కొన్ని సార్లు తప్పదు. కొందరిని నమ్మాల్సి వస్తుంది. నమ్మి తీరాల్సి వస్తుంది. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఒక్కోసారి కొందరిపై నమ్మకం పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా.. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఆచీతూచీ అడుగు వేయాలి. లేకపోతే.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపే వ్యక్తి ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచింది.

ap cm ys jagan mohan reddy yrsrcp andhra pradesh politics

ap cm ys jagan mohan reddy yrsrcp andhra pradesh politics

అయితే.. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాక.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఏ వ్యవస్థ ఎలా ఉంది.. అనే విషయం సీఎంలకు అంతగా అవగాహన ఉండదు. దాని కోసం ఖచ్చితంగా అధికారుల మీద డిపెండ్ అవ్వాల్సిందే. అధికారులను ఆసమయంలో నమ్మాల్సిందే. ఏవైనా పథకాలు ప్రవేశపెట్టినా.. రాష్ట్రంలో అన్ని రంగాల పరిస్థితి ఎలా ఉంది. ఏ వ్యవస్థ ఎలా నడుస్తోంది.. అనే విషయాలు అధికారులకే ఎక్కువగా తెలుస్తాయి.

అయితే.. ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా పని చేస్తోంది? అనే విషయం తెలియాలంటే మధ్యలో ఏవైనా ఎన్నికలు జరగాలి. అప్పుడు అధికార పార్టీని ప్రజలు గెలిపిస్తే.. ఖచ్చితంగా ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల ప్రచారంలోనూ సీఎం జగన్ పాల్గొనలేదు. ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటన చేయలేదు. ఆయన కేవలం క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. కేవలం అధికారుల మీద ఆధారపడి.. ఆయన ముందుకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తున్నారు.

YS Jagan : అధికారుల ఫీడ్ బ్యాక్ ను గుడ్డిగా నమ్మడం వల్లే?

అసలే ప్రస్తుతం ఏపీలో కరోనా కోరలు చాచింది. ఈ టైమ్ లో కూడా అధికారులు ఏది చెబితే అది నమ్మేస్తే.. మొదటికే మోసం వచ్చేసింది. ఉదాహరణకు.. ఆక్సిజన్ నిల్వలపై సీఎం జగన్.. ఎప్పుడు సమీక్ష నిర్వహించినా.. ఆక్సిజన్ నిల్వలు బాగానే ఉన్నాయంటూ అధికారులు చెప్పడం.. అది నిజమేనని జగన్ నమ్మడం.. ఆ తర్వాత ఆక్సిజన్ కొరతతో కరోనా పేషెంట్లు చనిపోవడం.. అప్పుడు ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోయడం.. చాలామంది ఆక్సిజన్ కొరతతో చనిపోయాక కానీ.. జగన్ కు తెలిసిరాలేదు.

అందుకే.. కేవలం అధికారుల మీద ఆధారపడటం వల్ల ప్రస్తుతం కరోనా విషయంలో సీఎం జగన్ కు కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలంటే.. అధికారులే కాదు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కూడా నివేదిక తెప్పించుకొని ఉంటే.. ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. అధికారులను ఎక్కడ ఉంచాలో అక్క్డడ ఉంచి.. తన పాలనను జగన్ సాగించాలని.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలను.. ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలంటూ కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. చూద్దాం మరి.. సీఎం జగన్ భవిష్యత్తులో ఎలా ముందడుగు వేస్తారో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది