Ys Jagan : చంద్రబాబు నాయుడు పై విమర్శల తూటాలు పేల్చడంలో సక్సెస్ అవుతున్న వైయస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : చంద్రబాబు నాయుడు పై విమర్శల తూటాలు పేల్చడంలో సక్సెస్ అవుతున్న వైయస్ జగన్..!

 Authored By aruna | The Telugu News | Updated on :19 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు పై విమర్శల తూటాలు పేల్చడంలో సక్సెస్ అవుతున్న వైయస్ జగన్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. మరి కొద్ది రోజులలో ఎన్నికలు రాబోతున్న వేళ తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో చెలరేగిపోతున్నారు. సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చంద్రబాబు నాయుడు నిజాస్వరూపాన్ని కళ్ళకు కట్టేలా మంచి చెడులు వివరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు లో నిర్వహించిన ‘ సిద్ధం ‘ మహాసభ జన సంద్రాన్ని తలపించింది. ముందు జరిగిన రెండు సభల కంటే ఈ మూడో సభ రెట్టింపు స్థాయిలో సక్సెస్ అయింది. యుద్ధానికి మీరు సిద్ధమా అని వైయస్ జగన్ ప్రశ్నించినప్పుడల్లా జనం పిడికిలి బిగించి సిద్ధమంటూ సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజానీకానికి జరిగిన మంచి గురించి వివరిస్తూ, మరోవైపు మూడు దశల్లో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన మార్క్ అంటూ ఫలానా అని చెప్పుకోలేని దుర్మార్గ పాలన సాగించారని విరుచుకుపడ్డారు.

జరగబోయే ఎన్నికల్లో ఎవరెవరి మధ్య అనే విషయాన్ని మేధావులకే కాదు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వైయస్ జగన్ వివరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని ఆయన వివరించారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి, పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని అడుగులు వేసే మనకు అటువైపు వద్దని అడ్డుకునే డ్రామాలాడుతున్న చంద్రబాబు నాయుడుకి మధ్య జరుగుతున్న యుద్ధంగా వైయస్ జగన్ అఅభివర్ణించారు. యుద్ధానికి మీరు సిద్ధమా అని వైయస్ జగన్ ప్రశ్నించడం జనం నుంచి సిద్ధమంటూ రెట్టించిన ఉత్సాహంతో రీసౌండ్ రావడం విశేషం.

యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందో వైయస్ జగన్ కవితాత్మకంగా చెప్పారు. పేదలు, పెద్దందారుల మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ మాట నిలబెట్టుకున్న మనకు అటువైపు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని వివరించారు. అలాగే విశ్వసనీయతకు, వంచనకు, నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ , ఇక్కడే ప్రజల మధ్య ఉండే మనకు యుద్ధం అంటూ జనంలో ఉత్సాహాన్ని నింపడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు వైయస్ జగన్ సవాలు విసిరారు. మీ పేరు చెబితే రైతులు, అక్క చెల్లెమ్మలకైనా, విద్యార్థులకైనా, అవ్వ తాతల కైనా ఇలా అన్ని వర్గాల ప్రజలకు గుర్తొచ్చే ఒక్క పథకమైన ఉందా అని నిలదీశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కనీసం 10% అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటు, మోసాలే అంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పై వైయస్ జగన్ విమర్శల తూటాలు పేల్చడంలో సక్సెస్ అయ్యారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది