YS Jagan : పంద్రాగస్టు నాడు మూడు రాజధానులపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : పంద్రాగస్టు నాడు మూడు రాజధానులపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

YS Jagan : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అది కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశమంతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన స్వాతంత్ర్య వేడుకల ఉపన్యాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్.. ఈసందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా.. మొత్తం 26 జిల్లాలుగా ఏపీని విభజించామని […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 August 2022,10:20 pm

YS Jagan : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అది కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశమంతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన స్వాతంత్ర్య వేడుకల ఉపన్యాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్..

ఈసందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా.. మొత్తం 26 జిల్లాలుగా ఏపీని విభజించామని చెప్పుకొచ్చారు. అలాగే రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానం అన్నారు.

YS Jagan Key Announcement On Three Capitals On 15th Aug

YS Jagan Key Announcement On Three Capitals On 15th Aug

YS Jagan : పింగళి వెంకయ్య రూపొందించిన జెండా..  భారతీయుల గుండె

పరిపాలన వికేంద్రీకరణే తమ విధానం అని… రాజధాని స్థాయిలోనే పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, సమతౌల్యానికి ఇదే పునాది అన్నారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మన దేశం ప్రతీక అని, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని తెలిపారు. ప్రపంచంలో పోటీ పడి మరీ మనం ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించింది. ఫార్మా రంగంలోనే ప్రపంచంలోనే భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రపంచానికే ఇప్పుడు మనం అవసరమైన ఔషధాలను అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది