YS Jagan : ఈ ఫైరే.. జగన్ లో అందరూ చూడాలనుకున్నది.. ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం కోసం సూపర్ ప్లాన్?
YS Jagan : ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ముహూర్తం వచ్చేసింది. ప్రతిపక్షాల విమర్శలకు.. కొన్ని వర్గాల మీడియాలకు చెక్ పెడుతూ.. ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే డిసెంబరు నుంచి వైఎస్ జగన్ ప్రజల్లోకి రానున్నారు. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అయితే సమస్యల పరిష్కారంపై మాత్రం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నామని చెప్పిన సీఎం జగన్.. అసలు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రూపాల్లోనూ నిధులు ఇస్తున్నందున.. సమస్యలు రావడం అనేది ఉంటే.. దానికి అధికారులదే బాధ్యతన్నారు.
విపక్ష విమర్శలకు చెక్ YS Jagan
తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు.. ఇప్పటి వరకు.. చేస్తున్న విమర్శలకు.. అంటే.. జగన్ జనాల్లో లేరంటూ.. చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. తమకు పనిలేదు.. అంతా వలంటీర్లు చూసుకుంటున్నారు.. అనేఆవేదనను వెళ్లగ క్కుతున్న విషయం తెలిసిందే. వలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలో ప్రజలు తమకు అవసరమైన వాటిని నేరుగా వలంటీర్లకే చెబుతున్నారు. ఇక, వలంటీర్లు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నిపథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. దీంతో గ్యాప్ పెరిగింది.
ఎమ్మెల్యేలకు పని.. YS Jagan
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా పని చెప్పారు. ఎమ్మెల్యేలు నిత్యం వారి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని.. వైఎస్ జగన్ సూచించారు. అంతేకాదు.. తనిఖీలు చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని.. ప్రతి ఒక్కరికీ.. సాయం అందేలా.. ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా చూడాలని అన్నారు. అంతేకాక తనిఖీల సమయంలో ఏలోపం కనిపించినా.. నోట్ చేసుకుని.. సంబంధిత అధికారులకు ఇచ్చి వివరణ తీసుకోవాలని.. తాను కనుక తనిఖీల సమయంలో ఆయా లోపాలను గుర్తిస్తే.. తీవ్రమైన చర్యలు తప్పవని.. కూడా ఎమ్మెల్యేలను, అధికారులను హెచ్చరించడం గమనార్హం.
పర్యటన, ప్రచారం వెరసి.. YS Jagan
త్వరలోనే రాష్ట్రంలో నూతన కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. క్లీన్ ఏపీ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు స్వయంగా వివరించారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర మంతా నిర్వహించాలని.. విజయవంతం చేయాలని సూచించారు. కేవలం పరిసరాల పరిశుభ్రతకే కాకుండా.. అవినీతి.. రహిత రాష్ట్రంగా తీర్చదిద్దడం కూడా ఈకార్యక్రమం ఉద్దేశమని వివరించారు. ప్రతి ఒక్కరూ.. ఈ కార్యక్రమంలో భాగం కావాలని సూచించారు. మొత్తంగా.. సీఎం జగన్ ఆదేశాలు.. రాజకీయంగా సంచలనం సృష్టించనున్నాయి.