Ys Jagan : రైతుల కోసం నాడు నేడు.. మార్కెట్‌లకు కొత్త కల
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని నిరూపించుకునేందుకు మరో మంచి పని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన గత ఏడాది రైతు దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు. గత ఏడాది దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో మొదలు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అధికారులు శర వేగంగా పని చేస్తున్నారు. పలు మార్కెట్ యార్డులు మరియు వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన భవనాలు.. స్టోరేజీ గోడమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అంటూ అధికారులు వెల్లడించారు.
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి మంచి ఫలితంను ఇస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్కూల్స్ ల్లో నాడు నేడు నిర్వహించి మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రైతు మార్కెట్ పరిధి పెంచడం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పంటను మార్కెటింగ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.రైతుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్ ల నవీణీకరణ చేయడంతో పాటు అధికారులు మరియు రైతుల సమన్వయంతో మార్కెట్ యార్డుల అభివృద్ధి చేస్తున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతు మార్కెట్ యార్డ్ ల్లో పారదర్శకంగా తమ పంటను అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో రైతు మార్కెటింగ్ ఇబ్బందులను ఎదుర్కొంది. దాంతో మధ్య దళారీలు రైతులను మోసం చేసే వారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వైకాపా నాయకులు అంటున్నారు. రైతు పక్షపాతి అయిన వైఎస్ జగన్ ఆలోచన తో మొదలైన నాడు నేడు మార్కెటింగ్ రంగాన్ని అనూహ్యంగా మారుస్తోంది అని రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.