YS Jagan : జగనన్న ఆ ముగ్గురిలో ఏ చెల్లిపై వేటు వేయబోతున్నాడో! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : జగనన్న ఆ ముగ్గురిలో ఏ చెల్లిపై వేటు వేయబోతున్నాడో!

 Authored By himanshi | The Telugu News | Updated on :29 April 2021,2:45 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సౌలభ్యం కోరకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న ముగ్గురు నుండి అయిదు మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గంలో ఉన్న వారిలో కొందరి పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైకాపా నాయకులు సైతం ఆ మంత్రుల తీరును తప్పుబడుతున్నారు. ప్రభుత్వంకు మరియు పార్టీకి చెడ్డ పేరు తీసుకు వస్తున్న ఆ మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకునే ఉద్దేశ్యంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నాడు. ఒకరు లేదా ఇద్దరు మహిళ మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదేమో అంటున్నారు.

YS Jagan : పని తీరుపై విమర్శలు…

YS Jagan one or two lady ministers no chance to again get post

YS Jagan one or two lady ministers no chance to again get post

మహిళ మంత్రులు ముగ్గురు ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ లో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతి మంత్రి కి సంబంధించిన రిపోర్ట్ ను నెల నెల తెప్పించుకుని చూస్తున్నాడు. మహిళ మంత్రులు ఆశించిన స్థాయిలో మాత్రం ప్రభావం చూడం లేదు. పార్టీ గురించి జనాల్లోకి వచ్చి మాట్లాడటంతో పాటు ప్రభుత్వంపై జనాల్లో నమ్మకం కలిగేలా చేయాలి. కాని ఆ మంత్రులు అలా చేయడంలో విఫలం అయ్యారట. అందుకే వారిని తొలగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కఠిన నిర్నయం తీసుకోక తప్పదు అంటున్నారు.

మళ్లీ మహిళకు..

ఒకరు లేదా ఇద్దరు మహిళలను మంత్రి పదవి నుండి తొలగిస్తే ఖచ్చితంగా ఒక్కరు అయినా కొత్తగా మహిళ మంత్రికి అవకాశం ఇవ్వవచ్చు అంటున్నారు. మొత్తానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేయబోతున్న మంత్రి వర్గ విస్తరణలో పాత వారు పోయేది ఎవరు.. కొత్తగా వచ్చేది ఎవరు. ఎవరి ప్లేస్ లో ఎవరు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిళ మంత్రులను తొలగించి విమర్శలు ఎదుర్కోకుండా మళ్లీ మహిళ మంత్రిని ఎంపిక చేయడం అనేది మంచి ఆలోచన అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది