YSRCP : విశాఖ క్లీన్ స్వీప్ కు వైకాపా మాస్టర్ ప్లాన్
YSRCP : అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు ఉండగానే అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్ కార్యకర్తలను మరియు పార్టీ నాయకులను సన్నద్దం చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలని ముందు నుండే వైయస్ జగన్ కసరత్తులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే మెజార్టీ సీట్లను ఈసారి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం ఏపీ జనాలకు అందించింది.
ఆ విషయాన్ని కార్యకర్తలు జనాల్లోకి తీసుకు వెళ్లగలిగితే ఖచ్చితంగా మరో సారి విజయం అధికార పార్టీ వైకాపాకు దక్కడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జగన్ పార్టీకి నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అక్కడ మంచి సీట్లు దక్కించుకుంది. కనుక ఈసారి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఇప్పటి నుండి కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు అయిన విశాఖ జిల్లాలో ఆకె అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఆ ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు తెలుగు దేశం గత ఎన్నికల్లో గెలుచుకుంది.వాటిని ఇప్పుడు గెలుచుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల ఇప్పటికే జగన్ పట్ల అక్కడి వారిలో అనుకూల పరిస్థితి ఉంది. మేయర్ ఎన్నికల్లో అది క్లియర్ గా కనిపించింది. కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తో పాటు చుట్టు పక్కల నియోజక వర్గాలు కూడా వైకాపా గెలుచుకునే అవకాశం ఉందని అంతా నమ్మకంతో ఉన్నారు. విశాఖపట్నం కోరుకున్నట్లుగా.. ప్రజలు కోరుకున్నట్లుగా.. రాజధానిని తీసుకొచ్చిన నేపథ్యంలో జగన్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారని వైకాపా నాయకులు నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు విశాఖకు మంచి చేకూరుస్తున్నాయి. కనుక విశాఖపట్నం మరియు చుట్టు పక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా వైకాపా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.