ys jagan : రోజాకు వైస్ జగన్ సూచన..!
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలిగా సోదరిగా ఎమ్మెల్యే రోజా సెల్వమణి పేరు దక్కించుకున్నారు. రోజాకు సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి ఇవ్వలేక పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెకు కీలకమైన శాఖకు సంబంధించిన నామినేటెడ్ పదవి ఇచ్చి ఆమెకు గౌరవం కల్పించాడు. త్వరలోనే జరుగబోతున్న మంత్రి వర్గ విస్తరణలో రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాడని అంతా భావిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో రోజా అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యింది. ఆమెకు రెండు ఆపరేషన్ లు జరిగినట్లుగా వైకాపా వర్గాల వారు చెబుతున్నారు. ఆపరేషన్ లు చేయించుకున్న రోజా ప్రస్తుతం చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలోనే ఇంకా చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.
ys jagan : రోజాను విశ్రాంతి తీసుకోమంటూ ఆదేశించిన సీఎం జగన్
రోజా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించి ఆరోగ్యం విషయంను తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ప్రచారంకు రావాలని భావించిందని తెలుసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. పరిషత్ ఎన్నికల ప్రచారం విషయం పక్కన పెట్టి పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటూ రోజాకు సూచించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా కూడా వెంటనే వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందించాల్సిందిగా వైధ్యులను ఆదేశిస్తూ వస్తున్నాడు. తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శతో రోజా చాలా సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.