Ys jagan
Ys jagan ఎంపీ మార్గాని భరత్ వర్సెస్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. అధికార పార్టీ నేతలే పరస్పర విమర్శలు.. అవినీతి ఆరోపణలతో రాజమండ్రిలో రచ్చ చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మాటల యుద్ధం రాష్ట్ర్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారపార్టీ నేతలై ఉండి, ఎంపీపై ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. క్రిమినల్స్, రౌడీషీటర్స్‌ను వెంటేసుకుని దందాలు చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించడం.. జక్కంపూడి రాజాపై మార్గాని భరత్ సైతం కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో.. వారిద్దరి రగడ తాడేపల్లికి చేరింది.
Ys jagan
ఎంపీ, ఎమ్మెల్యేల కుంపటిని చల్లార్చే పనిని తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ, వారిని కాంప్రమైజ్ చేయడం సుబ్బారెడ్డి వల్ల కూడా కాలేదు. వైవీ సమక్షంలోనే మార్గాని భరత్, జక్కంపూడి రాజాలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తిట్టుకోవడం కలకలం రేపింది. వైవీ సుబ్బారెడ్డి రెండు విడతలుగా మార్గాని భరత్, జక్కంపూడి రాజాలతో మాట్లాడి.. విడివిడిగా వారి నుంచి వివరణ తీసుకున్నారు. మార్గాని భరత్, జక్కంపూడి రాజాలను కాంప్రమైజ్ చేయడం తన వల్ల కావటం లేదని వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేయడంతో.. ఇక తప్పేలా లేదని సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ys jagan
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి మీడియా ముందు గొడవ పడితే యాక్షన్ తప్పదని.. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలని గట్టిగా చెప్పారట సీఎం జగన్. దీంతో.. రాజమండ్రి వైసీపీ వర్గపోరు ప్రస్తుతానికి సమసిపోయినట్టే అంటున్నారు.
Ysrcp
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.