Ys Jagan : వైఎస్ జగన్ కొత్త మహిళ మంత్రుల స్పందన భేష్
Ys Jagan : మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి మహిళలకు సముచిత స్థానం కల్పించారు. తన మొదటి కాబినెట్ లో అత్యధిక సంఖ్యలో మహిళలను తీసుకున్న జగన్ మరోసారి తన క్యాబినెట్ లో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించారు. మంత్రి వర్గంలో వారి యొక్క స్థాయిని స్థానాన్ని కంటిన్యూ చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎన్నో సమీకరణాలు మరెన్నో రాజకీయ వత్తిడులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో నలుగురు కొత్త మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టి మహిళల గౌరవాన్ని కల్పించారు.ఈ విషయంలో సీఎం జగన్ రెడ్డిని ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇదే సమయంలో కొందరు మహిళ మంత్రులపై విమర్శలు చేశారు. వీళ్లు ఏం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. విమర్శలు చేసిన వారికి సమాధానం అన్నట్లుగా తమ పనితోనే బదులు ఇస్తున్నారు కొత్త మహిళా మంత్రులు. వారు చేపట్టిన కార్యక్రమాలు మరియు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలప్రదం అవుతున్నాయి. ప్రతి ఒక్కరి నుండి కూడా అభినందనలు దక్కించుకున్నారు. మహిళా మంత్రులు పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయిన సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే నిర్వహించి క్షేత్ర స్థాయిలో వారి యొక్క పనితీరు పై ఒక అంచనాకు వచ్చారు.క్షేత్ర స్థాయిలో మెజారిటీ శాతం వారు కొత్త మహిళా మంత్రుల యొక్క పని తీరు పై ప్రశంసలు కురిపించారు.
పరిపాలన విషయంలోనే కాకుండా పార్టీ పరంగా కూడా వారికి మంచి మార్కులు పడుతున్నాయి. పార్టీ నాయకులు వారి పట్ల చాలా సానుకూల వైఖరితో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే వాటికి గట్టిగా సమాధానం చెప్పడంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో సక్సెస్ అవుతున్నారు అంటూ వైకాపా అధినాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇలాగే మహిళా మంత్రులు పని చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మరోసారి అవకాశాన్ని దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త మహిళ మంత్రులు ఎక్కడా కూడా తగ్గకుండా పరిపాలనలో దూసుకెళ్లడం అభినందనీయం.