YS Jagan : శుక్రవారం పూట గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్… వాళ్లకు పండగే ఇక?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్.. సంక్షేమ పథకాల్లో ఎప్పుడూ ముందుంటారు. అసలు… ఏపీలో ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు.. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. ఏ ప్రభుత్వం కూడా ప్రారంభించలేదు. పేదల కోసం, బడుగు, బలహీన వర్గాల ఉపాధి కోసం, ఉన్నతి కోసం, కార్మికుల కోసం, ఆడబిడ్డల కోసం, మహిళకు స్వయం ఉపాధి కల్పించడం కోసం… ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంభించి శెభాష్ అనిపించుకున్నారు. సంక్షేమ పథకాల్లో టాప్ అంటే ఏపీ అనే చెప్పుకోవాలి.

ys jagan to pay dwakra loans interest for second year also
తాజాగా జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం నాడు సీఎం జగన్… ఏపీలోని అక్కచెల్లెళ్లకు తీపి కబురు అందించారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్వాక్రా సంఘాల ద్వారా స్వయం ఉపాధి కోసం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై గత సంవత్సరం నుంచి ప్రభుత్వమే వడ్డీ కడుతోంది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని భరిస్తోంది. అయితే… ఈ సంవత్సరం కూడా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. మహిళలకు అండగా నిలబడటం కోసం… వాళ్లకు వడ్డీ భారాన్ని తప్పించేందుకు సీఎం జగన్ ఒక అన్నగా… వాళ్లకు మరోసారి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
YS Jagan : మహిళల సంఘాల ఖాతాలో వడ్డీ జమ
ఏపీ వ్యాప్తంగా సుమారు 1.02 కోట్ల మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ సంవత్సరం ఆ మహిళలు కట్టవలసిన వడ్డీ 1109 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం ఆయా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమచేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలు సంబురాలు చేసుకుంటున్నారు. అలాగే… ఈసందర్భంగా ప్రతి జిల్లా స్థాయి ఇన్ చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు… వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ సంక్షేమ పథకం ద్వారా… ఏపీలోని ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం, అలాగే మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం, వ్యాపార రంగంలో వాళ్లను తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతోనే ఇటువంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు సీఎం జగన్ ఈసందర్భంగా స్పష్టం చేశారు.