Tirupati bypoll : ఆ ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మూడినట్టే? జగన్ తో అర్జెంట్ మీటింగ్?
Tirupati bypoll : తిరుపతి ఉపఎన్నిక… ఇదే ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్. అసలు ఎంపీ సీటుకు ఎన్నిక… ఏ పార్టీ గెలిస్తే పార్లమెంట్ ఆ పార్టీ తరుపున గళం వినిపించినట్టు ఉంటుంది. అందుకే… తిరుపతి ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అలాగే.. అధికార పార్టీ వైసీపీ కూడా తిరుపతి ఉపఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, పరిషత్ ఎన్నికల విషయంలో సీఎం జగన్ అంతలా ఇన్వాల్వ్ కాకున్నా…. తిరుపతి ఉపఎన్నికల విషయంలో మాత్రం సీఎం జగన్ కాస్త సీరియస్ గా ఉన్నారు. ఆయనే రంగంలోకి దిగారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలోనూ సీఎం జగన్ పాల్గొననున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ… తిరుపతి ఉపఎన్నిక విషయంలో వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యే వల్ల సీఎం జగన్ చాలా సఫర్ అవుతున్నారట. ఆయన్నే కొందరు ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఒక ముఖ్యమంత్రిగా జగన్ సూపర్ సక్సెస్. అందులో నో డౌట్. ఏపీ ప్రజల మనసును గెలుచుకున్న నేత జగన్. అయితే.. సొంత పార్టీకి చెందిన కొందరు నేతల వల్ల జగన్ కు చెడ్డ పేరు వస్తోంది అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అలాగే… తిరుపతి ఉపఎన్నిక విషయంలోనూ కొందరు వైసీపీ నేతల నుంచి జగన్ కు ఎటువంటి సహకారం అందడం లేదట. ఈ సమయంలో వైసీపీ నేతలు సహకారం అందించకపోతే ఎట్లా భావించిన సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Tirupati bypoll : ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ?
అందుకే… తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేశారట. నిజానికి సీఎం జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఈనెల 14న పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందే.. అంటే ఈనెల 13న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చాలా సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశారట. వాళ్లను తాడేపల్లికే పిలిచి… సమావేశం అయ్యే అవకాశం ఉందట.
కొందరు ఎమ్మెల్యేలు వేరే పార్టీవైపు చూడటమే కాకుండా…. వాళ్లు పాల్పడే అక్రమాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందట. పార్టీలో ఉన్నటువంటి ఈ సమస్యల వల్ల వైసీపీ పార్టీకి తిరుపతి ఉపఎన్నికల్లో లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున… వీళ్లను సెట్ రైట్ చేస్తే… తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని గ్రహించిన సీఎం జగన్… వాళ్లతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారట. ఏది ఏమైనా.. తిరుపతి ఉపఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ బాగానే వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీని ఓడించాలంటే ఈ మాత్రం స్కెచ్ వేయాల్సిందే.