Ys jagan
Ys jagan కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.. KATASANI RAMBHUPAL REDDY రూట్ మార్చారా ? మౌనంగా ఉంటే కష్టమేనని భావిస్తున్నారా ? అటు పార్టీలోను, ఇటు నియోజకవర్గంలోనూ ఇబ్బందులు తప్పవని గ్రహించారా ? అంటే తాజా పరిణామం అవుననే స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం కాటసాని రాం భూపాల్ రెడ్డి దూకుడు పెంచారు. అదేసమయంలో తన రాజకీయ ట్రాక్ కూడా మార్చారు. గతానికి భిన్నంగా కాటసాని రాం భూపాల్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు పెట్టనికోట అయిన కర్నూలులో చాలా మంది కీలక నేతలు ఫైర్ బ్రాండ్ల మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో సీనియర్ మోస్ట్ నాయకుడు అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. కాటసాని రాం భూపాల్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా వివాదాలకు ఎప్పుడూ కాస్త దూరంగానే ఉంటారన్న పేరుంది. కానీ, తనకన్నా జూనియర్లు.. నిన్న మొన్ననే రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మాత్రం.. బిజీఅవుతున్నారు.. కీలక వ్యాఖ్యలతో పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నారు. అయితే ఇక్కడి మాజీ వైసీపీ నాయకురాలు.. చరితా రెడ్డి తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Ys jagan
చరితారెడ్డి గతంలో ఇక్కడ వైసీపీ తరఫున గెలవడంతోపాటు గట్టి వాయిస్ వినిపించారు. టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు సంధించారు. దీంతో పాణ్యం నియోజకవర్గం రాజకీయాలు లైమ్‌లైట్‌లో ఎప్పుడూ.. హాట్‌హాట్‌గా సాగాయి. అయితే.. చరితారెడ్డి గత ఎన్నికలకు ముందు.. వైసీపీ Ysrcp ని వీడి టీడీపీ TDP లోకి వెళ్లారు. అయితే అక్కడ నెగ్గలేక పోతున్నారు. దీంతో చరితారెడ్డి చూపు మళ్లీ వైసీపీవైపు పడుతోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు వైసీపీ గూటికి వచ్చేందుకు చరితా రెడ్డి రెడీగాఉన్నారు. మరోవైపు చరితారెడ్డికి ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా చరితారెడ్డికి బలం ఉంది. ఒకవేళ చరితారెడ్డి రిటర్న్ బ్యాక్ వస్తే ఇక్కడ పార్టీకి, ముఖ్యంగా కాటసాని రాం భూపాల్ రెడ్డికి కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. దీంతో కాటసాని రాంభూపాల్ రెడ్డి చరితారెడ్డికి చెక్ పెట్టే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో తన దూకుడు పెంచకపోతే.. కష్టమే అని భావించిన కాటసాని రాం భూపాల్ రెడ్డి ఇటీవల కాలంలో టీడీపీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధిస్తున్నారు.
Ys jagan Ysrcp MLA KATASANI RAMBHUPAL REDDY
సీనియర్ ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి KATASANI RAMBHUPAL REDDY ఇప్పటికీ.. సౌమ్యుడిగానే పేరుతెచ్చుకున్నా.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మారాల్సివస్తోందని.. పరిశీలకులు చెబుతున్నారు. గెలిచే నేతగా పేరు తెచ్చుకున్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys jaganఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పాణ్యం నియోజకవర్గం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు నాలుగు సార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానిక రాజకీయాలపై కాటసాని రాంభూపాల్ రెడ్డికి గట్టి పట్టుంది. అయితే టీడీపీ నేత బిజ్జం పార్థసారథి మళ్లీ తెరమీదికి వస్తుండడంతో, వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో మూడు ముక్కలాట తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> వైఎస్ జగన్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటదా? కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది ఆ మంత్రి పరిస్థితి?
ఇది కూడా చదవండి ==> కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న ఆ టీడీపీ నేత ఆశ.. ఈసారైనా నెరవేరుతుందా?
ఇది కూడా చదవండి ==> ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం.. వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్?
ఇది కూడా చదవండి ==> బాబాయికి… అబ్బాయి సారీ.. ఈసారికి ఇలా కానీవ్వండి… వైఎస్ జగన్ !
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.