Ys jagan : బాబాయికి… అబ్బాయి సారీ.. ఈసారికి ఇలా కానీవ్వండి… వైఎస్ జ‌గ‌న్‌ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys jagan : బాబాయికి… అబ్బాయి సారీ.. ఈసారికి ఇలా కానీవ్వండి… వైఎస్ జ‌గ‌న్‌ !

 Authored By sukanya | The Telugu News | Updated on :9 July 2021,3:35 pm

Ys jagan జీవితంలో ఒక్కసారి అయినా మంత్రి పదవి దక్కితే చాలనే కోరిక ఒక స్థాయికి చేరిన రాజకీయ నాయకులు అందరిలో సహజంగా ఉంటుంది. అలాంటిది, ముఖ్యమంత్రి బాబాయ్, మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డికి ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు. అయితే ఆయనకు కోరిక ఉన్నా, తీరాలని రూలైతే లేదు .. తాజాగా వైఎస్ జగన్ .. ఒంగోలు మాజీ ఎంపీ, వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గానే కొనసాగించాలని నిర్ణయించారని టాక్ నడుస్తోంది. అయితే వైవీకి మాత్రం మంత్రిపదవి లేకుంటే రాజ్యసభ ఎంపీ సీటు మీద  బోలెడంత ఇష్టం అని సన్నిహితులు చెబుతున్నారు. కానీ వైవీ సుబ్బారెడ్డి కోరికకు వైఎస్ జగన్ బ్రేకులు వేసినట్లేనని తెలుస్తోంది. ఈ ధపా మంత్రి పదవి గురించి ఆలోచించవద్దని, టీటీడీ ఛైర్మన్ గానే కొనసాగాలని జగన్మోహనరెడ్డి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Ys jagan YV Subbareddy continue to TTD Chairman

Ys jagan YV Subbareddy continue to TTD Chairman

బాబాయికి అబ్బాయి సారీ.. Ys jagan

అయితే వైఎస్ జగన్ Ys jagan బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి రిక్వెస్ట్’ను పరిశీలించకుండానే, సారీ చెప్పినట్లు సమాచారం. అయితే వైవీ గతంలోనే తన కోరికను చెప్పారని, దీనిపై అప్పుడు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. మరిప్పుడు ఎందుకు నో అంటున్నారన్నదే కీలకంగా మారింది. ఇప్పటికే ఒంగోలు జిల్లా నుంచి ముఖ్యమంత్రి సమీప  బంధువైన బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి ఇస్తే బాలినేనిని తొలిగించాల్సి వస్తుంది.. ముఖ్యంగా మంత్రివర్గంలో చుట్టాలకే చోటు ఇస్తే, ప్రజల్లోకి నెగటివ్ ఫీల్ వెళుతుందని కూడా వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లాల నుంచి ఆశావహులు భారీగా ఉన్నారని, వీరిని కాదని చుట్టాలకు పట్టం కట్టలేనని వైఎస్ జగన్ అంటున్నట్లు తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డికి నో చెప్పడం వెనుక వేరే కారణం కూడా ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

yv subba reddy

yv subba reddy

టీటీడీ ఛైర్మన్ గానే .. Ys jagan

ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవా.. లేక టీటీడీ ఛైర్మన్ గానే కొనసాగించాలా అన్న అంశంపై ఏకంగా కుటుంబ నేతలతోనే చర్చించారని,  అందుకే పరిశీలించకుండానే సారీ చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.. ఈ నేపథ్యంలో వెంకన్న ఆస్తుల అవసరం ఉందని వైఎస్ జగన్ భావిస్తున్నారు.అటువంటప్పుడు సొంత మనిషి ఉంటేనే, కార్యం కాగలదని జగన్మోహనరెడ్డి  Ys jagan అంచనా వేస్తున్నారు. ఇక ఒంగోలు జిల్లా నుంచి వైవీసుబ్బారెడ్డికి ఆవకాశం ఇస్తే, అక్కడి ఆశావహుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని కూడా వైఎస్ జగన్ యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వైవీ సుబ్బారెడ్డికి మంత్రిపదవి దక్కడం లేదని టాక్ నడుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెక్ట్స్ ఛాన్స్ అదేనని కేడర్ చర్చించుకుంటోంది.

Ys Jagan

Ys Jagan

ఇది కూడా చ‌ద‌వండి ==> టీడీపీలో ఈ నేత ఉన్నట్టా.. లేనట్టా.. గంటా ఈ మౌనం .. ఎందుకో.. ?

ఇది కూడా చ‌ద‌వండి ==> టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది