Ys Jagan : హిందువులను రెచ్చగొడుతున్న జగన్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : హిందువులను రెచ్చగొడుతున్న జగన్ ?

 Authored By siddhu | The Telugu News | Updated on :21 February 2026,5:00 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవుడు మరియు భక్తి అంశాలు ఇప్పుడు చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న పనులు చూస్తుంటే వీరికి దేవుడితో రాజకీయం చేయడం అలవాటుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉందంటూ అప్పట్లో విపరీతంగా దుష్ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు అధికారంలోకి రావడానికి వెంకటేశ్వర స్వామి నగలను వాడుకున్న వీరు ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి మళ్ళీ అదే దేవుడి పేరుతో నాటకాలు ఆడుతున్నారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి హెరిటేజ్ సంస్థపై విష ప్రచారం చేయగా ఢిల్లీ హైకోర్టు ఆ కథనాలను తొలగించాలని ఆదేశించింది. ఈ పరాభవాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు శాసన మండలిలో వికృత

Ys Jagan హిందువులను రెచ్చగొడుతున్న జగన్

Ys Jagan : హిందువులను రెచ్చగొడుతున్న జగన్ ?

చేష్టలకు పాల్పడుతున్నారు.

 

భక్తుల మనోభావాలతో  :

 

శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకువచ్చి ప్రదర్శించడం వరకు బాగున్నా కనీసం దేవుడికి ఇచ్చే గౌరవం కూడా లేకుండా కాళ్లకు చెప్పులు మరియు షూ వేసుకుని ఆ ఫోటోలను పట్టుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్లి వస్తే ప్రసాదం ఇచ్చినా సరే చెప్పులు విడిచి తీసుకుంటాము. అలాంటిది సాక్షాత్తు ఆ దేవుడి ఫోటోను పట్టుకుని అపవిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటే వీరికి హిందూ మతం పైన గానీ హిందూ దేవుళ్ల పైన గానీ ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టమవుతోంది. ఇలాంటి పనులు చేస్తూ హిందువులను రెచ్చగొట్టడం ఏంటని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. నమ్మకం లేకపోతే అది మీ వ్యక్తిగత విషయం కానీ ఇలా బహిరంగంగా దేవుడిని అవమానించడం మాత్రం సహించరాని విషయం.

 

జగన్ రెడ్డికి హిందూ సంప్రదాయాల మీద గౌరవం లేదనేది అనేక సందర్భాల్లో రుజువైంది. తిరుమలకు వెళ్ళినప్పుడు అన్య మతస్థులు ఇచ్చే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టకుండా తప్పించుకోవడం మరియు గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమల పరిధిని కేవలం రెండు కొండలకే పరిమితం చేస్తూ జీవోలు తీసుకురావడం వంటివి భక్తులు మర్చిపోలేదు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తులను మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడిన జగన్ ఇప్పుడు అధికారం పోయాక దేవుడి సొమ్మును దేవుడి వస్తువులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. అసలు దేవుడి పైన భక్తి ఉంటే కుటుంబ సమేతంగా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి కానీ ఒంటరిగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయాలను ఉల్లంఘించడం ఎందుకని భక్తులు మండిపడుతున్నారు.

 

ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత చర్చ నుండి తప్పించుకోవడానికి మండలిలో ఇలాంటి రచ్చ చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ల్యాబ్ రిపోర్టుల మీద చర్చించవచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు. అసెంబ్లీకి రాకుండా కేవలం మండలిలో ఫోటోలు పట్టుకుని చెప్పులతో ప్రదర్శనలు చేయడం వల్ల హిందువుల ఆగ్రహానికి గురికావడం తప్ప వీరికి వచ్చే లాభమేమీ లేదు. హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయించుకుంటున్న వైఎస్సార్సీపీ ఇలాంటి పనులు ఆపకపోతే భవిష్యత్తులో భక్తుల నుండి గట్టి సమాధానమే ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడితో ఆటలాడటం ఆపి ప్రజా సమస్యల మీద పోరాడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Also read

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది