ys sharmila : జై తెలంగాణ నినాదం ఔట్ డేటెడ్ షర్మిల గారు.. కాస్త కొత్తగా ట్రై చేయండి
ys sharmila : ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో జై తెలంగాణ నినాదం ఎంతో పవర్ ఫుల్. ఆ నినాదం చేస్తే తప్ప ముందుకు కదల్లేని పరిస్థితి. ఆ నినాదం చేయలేక చాలా మంది ఆంధ్రా నాయకులు తెలంగాణలో ఏకంగా తమ పార్టీలను మూట కట్టుకుని వెళ్లి పోయిన పరిస్థితి. జగన్ మరియు చంద్రబాబు నాయుడులు జై తెలంగాణ అనకపోవడం వల్లే ఇప్పుడు వారికి ఇక్కడ కనీస మర్యాద లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో వారు ఉమ్మడి ఆంద్రాకు మద్దతు తెలపడం వల్ల.. జై తెలంగాణ అనక పోవడం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వారి పార్టీలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు వారు జై తెలంగాణ అంటూ నినదించినా కూడా వారిని జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. జై తెలంగాణ నినాదం అనేది ఔట్ డేటెడ్ అయ్యింది.

ys sharmila jai telangana slogan for her new political party
తెలంగాణలో ఔట్ డేటెడ్ అయిన నినాదం ను ఇప్పుడు షర్మిల ఎత్తుకున్నట్లుగా కనిపించింది. ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయం అయ్యింది. ఆమె తాజాగా పలు జిల్లాల సానుభూతిపరులతో రాజన్న అభిమానులతో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా వారి ముందు కొన్ని ప్రశ్నలు ఉంచి వాటికి సమాధానాలు అడిగి తెలుసుకుంది. ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పార్టీ పెడితే మనుగడ ఎలా అంటూ కొన్ని అనుమానాలను నివృత్తి చేసేందుకు గాను షర్మిల ప్రయత్నించింది. ఈ సందర్బంగా షర్మిల జై తెలంగాణ.. జై వైఎస్సార్ అంటూ నినదించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడకు వెళ్లారు తల్లి మీరు.. రాష్ట్ర ఏర్పాటుకు మీ సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డు పడ్డాడు. ఆయనతో పాటు మరి కొందరు అడ్డు తగలడం వల్లే రాష్ట్ర ఏర్పాటు అనేది ఆలస్యం అయ్యింది. ఆ సమయంలో మీరు జై తెలంగాణ అని ఉంటే లేదా మీ సోదరుడితో అనిపించి ఉంటే ఎంతో మంది ఆత్మ బలిదానాలు ఆగిపోయేవి కదా అంటూ నెటిజన్స్ షర్మిలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో మీరు ఇప్పుడు వచ్చి జై తెలంగాణ అన్నంత మాత్రాన పట్టించుకునే వారు లేరు. అద్బుతం జరిగితే తప్ప మళ్లీ తెలంగాణ ప్రజలు మీలాంటి ఆంధ్రా నాయకులను పట్టించుకోరు అంటూ ఈ సందర్బంగా షర్మిల వ్యాఖ్యలను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.