YS Sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ కన్ఫమ్.. పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ?
YS Sharmila త్వరలోనే తెలంగాణలో ఓ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికార్లు చేస్తున్నాయి. నేను పార్టీ పెట్టడం ఏంటి? పత్రికల్లో ఏదైనా రాసేముందు నిజాలు తెలుసుకొని రాయండి.. అంటూ ఓ పత్రికకు షర్మిల ఈ విషయంపై వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. ఒక పత్రిక షర్మిల పార్టీ పెట్టబోతున్నారని అంత ధైర్యంగా రాశారు అంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది.
అసలే.. వైఎస్ షర్మిలకు, తన అన్న జగన్ కు అస్సలు పడటం లేదు. వైఎస్సార్సీపీ పార్టీ విషయంలో షర్మిల ప్రస్తుతం జోక్యం చేసుకోవడం లేదు. దీంతో తనకు ఒక ప్లాట్ ఫాం కావాలి కాబట్టి.. ఏపీలో కాకుండా తెలంగాణలో తన తండ్రి వైఎస్సార్ కు ఉన్న పాపులారిటీని ఉపయోగించుకొని ఎదగాలని షర్మిల ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే తను దూకుడు పెంచేసింది. తాజాగా హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తెలంగాణలో పార్టీకి పెట్టడానికి సంబంధించి.. షర్మిల పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట. ఇప్పటికే తన సన్నిహితులకు, వైఎస్సార్ అభిమానులకు సమాచారం అందించారట. వైఎస్ఆర్ కు తెలంగాణలో ఉన్న పాపులారిటీని ఉపయోగించుకోవడం కోసం పార్టీ పేరును కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్టు తెలుస్తోంది.
YS Sharmila : ఒక్కసారిగా మారిపోయిన తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో ఇదివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బడా నేతలు కూడా షర్మిల పార్టీ పెడితే చేరడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే.. ఆమె పార్టీ పెట్టిన తర్వాత.. పరిస్థితులను బట్టి పార్టీలో చేరాలని కొందరు నేతలు నిర్ణయించుకున్నారట.
షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు.. అంటూ తెలంగాణలో ప్రచారం జోరుగా సాగేసరికి.. తెలంగాణలో రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలో తమకున్న అసంతృప్తి వల్ల బయటికి వెళ్లలేని కొందరు నేతలు.. షర్మిల పార్టీ పెడితే అందులో దూకడానికి రెడీగా ఉన్నారట. ఏది ఏమైనా.. తెలంగాణలో మరో పార్టీకి ఎంత చోటు ఉంది.. అనేది తెలియాలంటే మాత్రం షర్మిల పార్టీ పెట్టేవరకు వేచి చూడాల్సిందే.