YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ షర్మిల గురించే అందరూ చర్చిస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీ పెడుతానంటూ ప్రకటించినప్పటి నుంచి ఆమె గురించే చర్చ. వైఎస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించడంతో పాటు… తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేయడం, వైఎస్సార్ అభిమానులతో మాట్లాడటం, ఇతర నాయకులతో మాట్లాడటం, పార్టీ విధివిధానాలు, పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. పార్టీ పేరు ఏది అయితే బాగుంటుంది అనే అంశాలపై ఆమె ప్రతి జిల్లాలో పర్యటించి తెలుసుకున్నారు.
ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో రంగప్రవేశం చేసి… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభ విజయవంతం అయింది. సంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ షర్మిల తన విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ప్రశ్నించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నానని… తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ ఆమె స్పష్టం చేశారు. నిరుద్యోగుల తరుపున నేను నిలదీస్తానని.. నేను ప్రశ్నిస్తానని ఆమె సంకల్ప సభలో మాటిచ్చారు. అలాగే… ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేకపోతే ఉద్యోగ దీక్ష చేస్తానంటూ ఆమె సంకల్ప సభలో స్పష్టం చేశారు.
ఆమె చెప్పిన మాట ప్రకారం.. నిన్న అంటే ఏప్రిల్ 15న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ దీక్షను ప్రారంభించారు. తనకు నిరుద్యోగులు, యువకులు, జర్నలిస్టులు, రచయితల నుంచి మద్దతు లభించింది. అయితే తను 3 రోజుల పాటు దీక్ష చేయాలని సంకల్పించగా… పోలీసులు తనకు అనుమతి మంజూరు చేయలేదు. దీంతో షర్మిల నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసి… అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ లోటస్ పాండ్ దిశగా కదిలారు. అయితే తనకు అడుగడుగునా పోలీసులు అడ్డుతగిలారు. ఆతర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద తన మద్దతుదారులకు, పోలీసులకు జరిగిన తోపులాటలో షర్మిల స్పృష తప్పి కిందపడిపోవడంతో తనను అరెస్ట్ చేసి బెగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి… ఆ తర్వాత వదిలేశారు.
ఇందిరాపార్క్ వద్ద తనను దీక్ష కొనసాగనీయకపోవడంతో… షర్మిల తన దీక్షను లోటస్ పాండ్ లోని తన నివాసం వద్ద కొనసాగించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ… జులై 8 వ తారీఖున పార్టీ పెడుతున్నా. ఆరోజే పాదయాత్ర తేదీని ప్రకటిస్తా. నేను పోరాటం చేసేదే నిరుద్యోగుల కోసం. నా జీవితం ఓకే కానీ.. తెలంగాణ ప్రజల జీవితం, తెలంగాణ నిరుద్యోగుల కోసమే నేను పోరాటం చేస్తున్నా.. బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం. 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా కూడా కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చలేదు. ఆయన వల్ల కాదు. నిరుద్యోగులు, యువకులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకోసం నేను పోరాటం చేస్తాం… ఇక నుంచి ఒక్క యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. మీకు నేనున్నాను… అంటూ షర్మిల భరోసా ఇచ్చారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.