ys sharmila shared rare photos on her sons birthday
YS Sharmila : YSRTP పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకురాలిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా ఇంకా సీఎం జగన్ చెల్లెలిగా … అందరికీ సుపరిచితురాలే. అయితే అన్న ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా రాణిస్తుంటే తెలంగాణ కోడలిగా… సొంతంగా YSRTP పార్టీ పెట్టి.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న షర్మిల అనేక రాజకీయ దాడులు ఎదుర్కొంటూ ఉంది.
ఇదే సమయంలో మరొక పక్క ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర ఆగకుండా కొనసాగిస్తానని అంటూ ఉంది. “ప్రజా ప్రస్థానం” పేరిట షర్మిలా చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేయడంతో పాటు.. పాదయాత్రకి అనుమతులు ఇవ్వకపోవడం… వంటి వాటితో ఇటీవల వార్తలలో నిలిచింది. ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క కుటుంబాన్ని కూడా చూసుకునే షర్మిల… కొడుకు రాజారెడ్డి పుట్టినరోజు నాడు.. సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా కొడుకుతో దిగిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి…
ys sharmila shared rare photos on her sons birthday
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే రాజా… హ్యాపీనెస్ ఆల్వేస్… ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనే క్యాప్షన్ పెట్టి కొడుకు పై షర్మిల తన ప్రేమను చాటుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదో వెకేషన్ లో ఫోటో దిగినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాజారెడ్డి అమెరికాలో చదువుతూ ఉన్నాడు. అంతేకాదు బాక్సింగ్.. వంటి క్రీడల్లో కూడా రాజారెడ్డి ఛాంపియన్ గా అమెరికాలో నిలిచినట్లు.. అప్పట్లో వార్తలు వచ్చాయి. షేర్ చేసిన ఫోటోలో షర్మిల కాస్త మోడ్రన్ లుక్ లో కనిపించడం విశేషం.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.