Home » Exclusive » Ys Sharmila Son Entry In Us In Meeting
Exclusive

YS Sharmila Son : ఫస్ట్ టైం స్టేజిపైన అదరగొట్టిన వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి..!!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 20, 2023 11:23 pm
Advertisement

YS Sharmila Son : వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను వైఎస్సార్ కూతురు. ఇప్పుడు తను కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీలో తన అన్న వైఎస్ జగన్ రాజకీయాల్లో రాణించడమే కాదు.. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక.. ఆయన చెల్లెమ్మ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆమె ఏకంగా తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ తెలంగాణలో యాక్టివ్ గా ఉంది.

Advertisement

అయితే.. షర్మిల వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. ఆమెకు కొడుకు ఉన్నాడు. కానీ.. అతడు ఎవరు.. ఎక్కడ ఉంటాడు అనేది చాలామందికి తెలియదు. వైఎస్ షర్మిల కొడుకు పేరు రాజా రెడ్డి. అతడు యూఎస్ లో ఉంటున్నాడు. యూఎస్ లోనే చదువుతున్నాడు. అయితే.. ఇటీవల షర్మిల అమెరికా వెళ్లారు. అక్కడ ఉన్న వైఎస్సార్ అభిమానులు షర్మిల కోసం ప్రత్యేకంగా ఒక సభను ఏర్పాటు చేశారు.

YS Sharmila Son entry in us in meeting

Advertisement

YS Sharmila Son : అమెరికాలో మీటింగ్ లో తన కొడుకును పరిచయం చేసిన షర్మిల

ఆ సభలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఆమెతో పాటు షర్మిల కొడుకు రాజా రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సభలో తన కొడుకును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడో చిన్నప్పుడు చూశారు అందరు. రాజా రెడ్డి ఇప్పుడు పెద్దవడంతో అందరూ చూసి షాక్ అయ్యారు. దీంతో అక్కడికి వచ్చిన వాళ్లందరికీ తన కొడుకును షర్మిల పరిచయం చేశారు. దీంతో అక్కడ చప్పట్లతో సభ మారుమోగిపోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి