హైదరాబాద్: వైఎస్సార్ వర్దంతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే ఏపీలో జగన్ – తెలంగాణలో షర్మిల రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం హెచ్ఐసీసీ నోవాటెల్ లో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. ఇది రాజీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న సమావేశంగా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీని ద్వారా జగన్ – షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో విజయమ్మ ఈ సమావేశం ఏర్పాటు చేసారా అనే చర్చ మొదలైంది. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ కంటిన్యూ అవుతోంది. జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేయించారా..లేక షర్మిల సూచనతో విజయమ్మ ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.
కానీ, వైఎస్సార్ అభిమానులకు షర్మిల ఈ సమావేశం ద్వారా తమ కుటుంబంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వటానికే అంటూ మరో వాదన మొదలైంది. దీంతో..సెప్టెంబర్ 2న ఇడుపులపాయకు జగన్ – షర్మిల రాక గురించి ఒక ఆసక్తి కంటిన్యూ అవుతుంటే..మరో వైపు విజయమ్మ ఇలా ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేయటం మరో ఇంట్రస్టింగ్ అంశంగా మారుతోంది. ఈ సమావేశంపై అటు వైసీపీ అభిమానుల్లో..ఇటు వైఎస్సార్టీపీ నేతలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో నూ ఆసక్తి కనిపిస్తోంది.
వైఎస్ జమానాలో ఆయన మంత్రి వర్గంలో పనిచేసి మాజీ అమాత్యులు… మేధావులతో విజయమ్మ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి విజయమ్మ ఇప్పటికే సదరు నేతలకు ఆహ్వానాలు పంపారు. హైదరాబాద్ లోని హోటల్ నోవాటెల్లో సెప్టెంబరు 2న సాయంత్రం 5గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే.. ఈ ఆహ్వానంలో మాత్రం.. ఇది రాజకీయ సమావేశం కాదని.. పార్టీలకు కూడా సంబంధం లేదని ఆమె ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశంపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. అసలు వైఎస్ దివంగతులై.. 12 సంవత్సరాలు అయిన తర్వాత.. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు? దీనివెనుక ఏముంది? వంటి అనేక అంశాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా ఈ సమావేశంలో విజయమ్మ.. తన కుమారుడు ఏపీ సీఎం జగన్ కానీ అదేసమయంలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు.. వైఎస్ తనయ.. షర్మిల ప్రమేయం ఉన్నట్టు వెల్లడించకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. విజయమ్మ సొంతగా తొలిసారి నిర్వహిస్తున్న కార్యక్రమమనే చెప్పాలి. అంతేకాదు.. రాజకీయ పరంగా చూసుకున్నా.. ఇప్పటి వరకు విజయమ్మ ఎప్పుడూ.. ఒంటరిగా లేరు. అటు కుమారుడు జగన్ తోనో .. ఇటు కుమార్తె షర్మిలతోనో ఉన్నారు. కానీ తొలిసారి ఆమె ఒక్కరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.
అంతేకాదు.. దాదాపు ఏడేళ్ల తర్వాత.. విజయమ్మ మళ్లీ ఇలా సభకు హాజరు కావడం గమనార్హం. ఇటీవల షర్మిల నిర్వహించిన వైఎస్సార్టీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్నారు. ఈక్రమంలో తన కుమార్తె షర్మిలను ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా విజయమ్మ ప్రకటించిన సమావేశం ఉద్దేశం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతలను వైఎస్ మంత్రి వర్గంలో పనిచేసిన వారిని ఆమె ఆహ్వానించారు. అయితే..
ఇప్పటి వరకు విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం.. అటు ఏపీ ఇటు తెలంగాణల తన కుమారుడు కుమార్తెల రాజకీయాలకు అండగా నిలవాలని వారి విజయమ్మ కోరే ఉద్దేశం ఏమాత్రం లేదని.. కేవలం వైఎస్ ఆర్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని.. సమాజంలో పేదలు బడుగులకు సేవ చేయాలనే దృక్ఫథంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని.. అంటున్నారు. ఈ సంస్థ ఏర్పాటు అటు జగన్కు ఇటు షర్మిలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.