YS Sharmila : వైఎస్సార్ వర్ధంతిని తన పార్టీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోబోతున్న వైఎస్ షర్మిల? ఏంటా ప్లాన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : వైఎస్సార్ వర్ధంతిని తన పార్టీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోబోతున్న వైఎస్ షర్మిల? ఏంటా ప్లాన్?

హైదరాబాద్: వైఎస్సార్ వర్దంతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే ఏపీలో జగన్ – తెలంగాణలో షర్మిల రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం హెచ్ఐసీసీ నోవాటెల్ లో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. ఇది రాజీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న సమావేశంగా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీని ద్వారా జగన్ – షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో […]

 Authored By sukanya | The Telugu News | Updated on :1 September 2021,8:45 pm

హైదరాబాద్: వైఎస్సార్ వర్దంతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే ఏపీలో జగన్ – తెలంగాణలో షర్మిల రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం హెచ్ఐసీసీ నోవాటెల్ లో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. ఇది రాజీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న సమావేశంగా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీని ద్వారా జగన్ – షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో విజయమ్మ ఈ సమావేశం ఏర్పాటు చేసారా అనే చర్చ మొదలైంది. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ కంటిన్యూ అవుతోంది. జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేయించారా..లేక షర్మిల సూచనతో విజయమ్మ ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.

కానీ, వైఎస్సార్ అభిమానులకు షర్మిల ఈ సమావేశం ద్వారా తమ కుటుంబంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వటానికే అంటూ మరో వాదన మొదలైంది. దీంతో..సెప్టెంబర్ 2న ఇడుపులపాయకు జగన్ – షర్మిల రాక గురించి ఒక ఆసక్తి కంటిన్యూ అవుతుంటే..మరో వైపు విజయమ్మ ఇలా ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేయటం మరో ఇంట్రస్టింగ్ అంశంగా మారుతోంది. ఈ సమావేశంపై అటు వైసీపీ అభిమానుల్లో..ఇటు వైఎస్సార్టీపీ నేతలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో నూ ఆసక్తి కనిపిస్తోంది.

ys sharmila

ys sharmila


వైఎస్ వర్గానికి ఆహ్వానం వెనుక.. YS Sharmila

వైఎస్ జమానాలో ఆయన మంత్రి వర్గంలో పనిచేసి మాజీ అమాత్యులు… మేధావులతో విజయమ్మ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి విజయమ్మ ఇప్పటికే సదరు నేతలకు ఆహ్వానాలు పంపారు. హైదరాబాద్ లోని హోటల్ నోవాటెల్లో సెప్టెంబరు 2న సాయంత్రం 5గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే.. ఈ ఆహ్వానంలో మాత్రం.. ఇది రాజకీయ సమావేశం కాదని.. పార్టీలకు కూడా సంబంధం లేదని ఆమె ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశంపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. అసలు వైఎస్ దివంగతులై.. 12 సంవత్సరాలు అయిన తర్వాత.. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు? దీనివెనుక ఏముంది? వంటి అనేక అంశాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా ఈ సమావేశంలో విజయమ్మ.. తన కుమారుడు ఏపీ సీఎం జగన్ కానీ అదేసమయంలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు.. వైఎస్ తనయ.. షర్మిల ప్రమేయం ఉన్నట్టు వెల్లడించకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. విజయమ్మ సొంతగా తొలిసారి నిర్వహిస్తున్న కార్యక్రమమనే చెప్పాలి. అంతేకాదు.. రాజకీయ పరంగా చూసుకున్నా.. ఇప్పటి వరకు విజయమ్మ ఎప్పుడూ.. ఒంటరిగా లేరు. అటు కుమారుడు జగన్ తోనో .. ఇటు కుమార్తె షర్మిలతోనో ఉన్నారు. కానీ తొలిసారి ఆమె ఒక్కరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.

ap cm ys jagan list on mlc post vishakapatnam ysrcp

ap cm ys jagan list on mlc post vishakapatnam ysrcp

భిన్న కథనాల వెల్లువ.. YS Sharmila


అంతేకాదు.. దాదాపు ఏడేళ్ల తర్వాత.. విజయమ్మ మళ్లీ ఇలా సభకు హాజరు కావడం గమనార్హం. ఇటీవల షర్మిల నిర్వహించిన వైఎస్సార్టీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్నారు. ఈక్రమంలో తన కుమార్తె షర్మిలను ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా విజయమ్మ ప్రకటించిన సమావేశం ఉద్దేశం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతలను వైఎస్ మంత్రి వర్గంలో పనిచేసిన వారిని ఆమె ఆహ్వానించారు. అయితే..

ఇప్పటి వరకు విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం.. అటు ఏపీ ఇటు తెలంగాణల తన కుమారుడు కుమార్తెల రాజకీయాలకు అండగా నిలవాలని వారి విజయమ్మ కోరే ఉద్దేశం ఏమాత్రం లేదని.. కేవలం వైఎస్ ఆర్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని.. సమాజంలో పేదలు బడుగులకు సేవ చేయాలనే దృక్ఫథంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని.. అంటున్నారు. ఈ సంస్థ ఏర్పాటు అటు జగన్కు ఇటు షర్మిలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది