Ys Sunitha : వివేకా కేసులో భారీ ట్విస్ట్ ఇదే.. అతిపెద్ద బాంబుపేల్చిన వైఎస్ సునీత వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 15 March 2023, 6:40 pm

Ys Sunitha : నేడు వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా కూతురు వైయస్ సునీత నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య కేసులో తనకు తెలిసిన విషయాలన్నీ సిబిఐకి చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి హత్యపై గతంలో కొంతమంది తేలిగ్గా మాట్లాడాలని… కడప కర్నూలు ప్రాంతాలలో ఇలాంటివి కామన్ కాదమ్మా అన్నట్లు చెప్పకు వచ్చారు. అయితే వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Sunitha Comments On Avinash Reddy

YS Sunitha Comments On Avinash Reddy

కాజా పరిస్థితులు చూస్తే 30 ఏళ్ల కిందటి గొడవలు మళ్లీ మొదలవుతాయేమో అనే భావన కలుగుతుందని తెలిపారు. కచ్చితంగా తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి. కేసు విచారణ లో ఉన్న నేపథ్యంలో… కేసు గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదు. దర్యాప్తు సంస్థలు పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఎంతోమంది తెలియకుండానే సహకరిస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో

AP Govt And Influential People Trying To Save Avinash: Viveka Daughter  Sunitha

ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వైయస్ సునీత స్పష్టం చేయడం జరిగింది. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని… కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తనకు తెలిసిన విషయాలన్నీ సిబిఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తన తండ్రి హత్య కేసులో నిజం తెలియాలనే పోరాటం తాను చేస్తున్నట్లు వైయస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp