రైతును నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.. పట్టరాని ఆనందంలో ఏపీ రైతన్నలు
ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తుంటారు. కానీ.. వాటిని నిలబెట్టుకునేది మాత్రం కొందరు కూడా కాదు. అతి తక్కువ మంది మాత్రమే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. అలా ఎన్నికల ముందు ఏం చెప్పారో.. ఎన్నికల తర్వాత.. గెలిచిన తర్వాత కూడా అదే చేస్తూ.. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
గతంలో పంట బీమాపై రైతన్నలకు అస్సలు నమ్మకమే ఉండేది కాదు. పంట నష్టపోయినా రూపాయి వచ్చేది కాదు. దీంతో రైతన్న తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గత ప్రభుత్వాలు ప్రీమియాలు కట్టించుకున్నాయి కానీ.. రూపాయి ఇవ్వలేదు. కానీ.. అందరి కంటే భిన్నంగా సీఎం జగన్ మాత్రం… పంట బీమాలో సమూల మార్పులు చేశారు. రైతుల నుంచి రూపాయి కూడా తీసుకోకుండా.. ప్రభుత్వమే పంటల బీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. అలా ఏపీలో మొత్తం 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చుతోంది. రాష్ట్రంలో ఉన్న కోటీ 14 లక్షల ఎకరాలకు బీమాను వర్తింపజేస్తోంది ఏపీ ప్రభుత్వం. దాని కోసం తీసుకొచ్చిన పథకమే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం.
ఈ పథకం ద్వారా తాజాగా 9.48 లక్షల మంది రైతులకు 1252 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్ చెల్లించారు. వీళ్లంతా 2019 సంవత్సరంలో పంట నష్టపోయిన రైతులు. అలాగే నివర్ తుపాను వల్ల నష్టపోయిన పంటకు కూడా డిసెంబర్ 31న పరిహారాన్ని అందించనుంది ఏపీ ప్రభుత్వం. 2020 కి సంబంధించి పంటల బీమాను వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వం చెల్లించనుంది.
చరిత్రలోనే మొదటిసారిగా రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు
అలాగే.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వర్షం వల్ల తడిసిన ధాన్యం రంగుమారినా… మొలకెత్తినా కొనుగోలు చేయలేదు. దీంతో అన్నదాత తీవ్రంగా నష్టపోయేవాడు. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం చరిత్రలోనే తొలిసారిగా రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.
రైతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చి.. పంట నష్టపోతే బీమా ద్వారా వాళ్లకు నష్టపరిహారం అందిస్తూ.. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఏపీ సీఎం జగన్ ను ఏపీ రైతులు చేతులెత్తి మొక్కుతున్నారు. ఇన్నేళ్లు ఇటువంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రిగా లేడు. ఇన్నేళ్లు రైతుగా ఎన్నో బాధలు అనుభవించాం కానీ.. ఇప్పుడు రైతు పక్షపాత ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ఉంటేనే మాకు ధైర్యం. మీరు చల్లగా ఉండాలి. రైతును నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోతారు.. అంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.