YS Jagan : 12 సంవత్సరాల జగన్ సామ్రాజ్యం..!
YS Jagan : ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ పెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఏపీ ఉండేది. ఉమ్మడి ఏపీలో వైసీపీ పార్టీ ఆవిర్భవించింది. మార్చి 12న పార్టీని లాంచ్ చేశారు వైఎస్ జగన్. తాజాగా వైసీపీ 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. దీంతో ఏపీ అంతటా వైసీపీ పార్టీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి పలు సేవా కార్యక్రమాలను ఇవాళ వైసీపీ నిర్వహిస్తోంది. వైసీపీ నేతలంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ
పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. పలువురు నాయకులు సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ 13 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇది రైతన్నల పార్టీ అన్నారు. పల్లెలు, నిరుపేదలను ప్రేమించే నాయకుడి పార్టీ అని ట్వీట్ చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించే పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ అని కొనియాడారు.
YS Jagan : ఓటమి ఎరుగని పార్టీ వైసీపీ
వైసీపీ ఓటమి ఎరుగని పార్టీ అని చెప్పుకొచ్చారు కీలక నేతలు. 12 ఏళ్ల ప్రస్థానంలో వైసీపీ ప్రయాణం అనేది ఒక చరిత్ర అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 12 ఏళ్లుగా పార్టీని సీఎం జగన్ ఆదర్శంగా నెడుతున్నారని సజ్జల చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎంతమంది కుట్రలు చేసినా పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరని ఆయన తెలిపారు. దేశ చరిత్రలోనే వైసీపీ పార్టీ ఎన్నో సంచలనాలను సృష్టించిందని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా ఘనంగా వైసీపీ సంబురాలను వైసీపీ నేతలతో పాటు ఏపీ ప్రజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.