Chandrababu : వైసీపీ మాస్టర్ ప్లాన్.. ఒక్క నేత రాజీనామా చేస్తే చంద్రబాబుకి అది కూడా గోవిందా..?
Chandrababu : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం చాలా సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఏపీలో రాజకీయాలన్నీ చంద్రబాబు చుట్టే తిరుగుతున్నాయి. అధికార వైసీపీ పార్టీ కూడా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షనేతగా ఉండి.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ… ఏపీ ప్రజల మన్ననను పొందేందుకు చంద్రబాబు బాగానే ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ వైసీపీ విజయదుందుబి మోగించింది. త్వరలో తిరుపతిలో ఉపఎన్నిక కూడా జరగనుంది. దీంతో అధికార వైసీపీ పార్టీ బాగానే ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ గెలవకుండా చేసేందుకు పక్కాగా ప్లాన్లు వేస్తోంది. టీడీపీకి అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీల బలం లేకుండా చేసేందుకు వైసీపీ గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది.
అదే కాదు.. త్వరలో బద్వేల్ ఉపఎన్నిక కూడా జరగనుంది. ఇటీవలే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అక్కడ కూడా ఉపఎన్నిక రానుంది. అదొక్కటే కాదు. ఇంకా మరిన్ని ఉపఎన్నికలు వచ్చేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
Chandrababu : ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జంప్?
ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జగన్ క్యాంపులో చేరారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్ గణేశ్ కుమార్… ఈ నలుగురు వైసీపీలో చేరారు. అలాగే.. మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు 23. అందులో నలుగురు… వైసీపీలో చేరారు. ఒకరు రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం ఉన్నది 18 మందే. చంద్రబాబు… ప్రతిపక్ష నేతగా ఉండాలంటే అసెంబ్లీలో ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే.
ప్రస్తుతం ఉన్నవాళ్లలో ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసినా… లేక వేరే పార్టీలో చేరినా…. ముందు చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. అలాగే… టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి… మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లాలనేది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది.అంటే…. తిరుపతి ఉపఎన్నికతో పాటు… త్వరలో మరో ఐదారు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఉపఎన్నికలు రానున్నాయన్నమాట.
ఓవైపు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి.. టీడీపీ ఎమ్మెల్యేలతో అఫిషియల్ గా రాజీనామా చేయించి… అక్కడ ఉపఎన్నికల్లో గెలిచి….. వైసీపీసత్తా చాటాలనేది హైకమాండ్ ప్లాన్ అట. ఇప్పటికే టీడీపీకి మంచి రోజులు లేవు. అటా ఇటా అన్నట్టుగా ఉంది పార్టీ. ఈనేపథ్యంలో అధికార పార్టీ టీడీపీపై మరింత ఫోకస్ పెడితే… టీడీపీ ఖేల్ ఖతమే ఇక.