YSRCP : వైకాపా ‘గడప గడపకు మన ప్రభుత్వం’
YSRCP : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినూత్నంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఎంపీలు వెళ్లాలంటూ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడంతో పాటు వారికి అందుతున్న పథకాలను గురించి తెలుసుకోబోతున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను నెరవేర్చామని.. కొన్ని ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం అమలు చేసినట్లుగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నట్లుగా అధినేత జగన్ పేర్కొన్నారు. నియోజక వర్గంలోని గ్రామ, వార్డు సచ్చివాలయాలను సందర్శించాలి. అక్కడ పని తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి పని తీరు గురించిన వివరాలు.. అక్కడ అమలు అవుతున్న కార్యక్రమాలను గురించి స్తానికులతో చర్చించాలన్నారు.
ప్రజల నుండి కొత్తగా వచ్చే డిమాండ్ లను నోట్ చేసుకోవాలి.. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా విని వారి యొక్క సమస్యల పరిష్కారంకు మార్గం చూపాలంటూ సీఎం జగన్ సూచించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక తరహాలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కనుక ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం సక్సెస్ అయితే జనాల్లో వైకాపా ప్రభుత్వం పై చాలా విశ్వాసం పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.