YSRCP : ‘అన్నా నువ్వు అర్జెంట్ గా రావాలి’ గుంటూరు నుంచి జగన్ కి హాహాకారాలు !
YSRCP : ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకుండానే అప్పుడే వచ్చే ఎన్నికల్లో వీళ్లు గెలిచేనా అనే అనుమానాలు కలిగేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పలు జిల్లాల్లో స్థానిక నాయకులకు ఎమ్మెల్యేలకు పడటం లేదు. దాంతో ఖచ్చితంగా ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని రాబోయే రెండు మూడు సార్లు ఎన్నికల్లో కూడా గెలిపించేందుకు గాను పథకాలు ప్రవేశ పెడుతూ అభివృద్ది పనులు చేస్తుంటే సొంత పార్టీ నాయకుల ఓవర్ యాక్షన్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
YSRCP : గుంటూరు వైకాపాలో గందరగోళం..
రాష్ట్రంలో పలు చోట్ల ఎమ్మెల్యేలకు మరియు స్థానిక నాయకులకు పొసగడం లేదు. దాంతో రెండు గ్రూప్ లుగా విడిపోయి కుమ్ములాట సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో గుంటూరు రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏపీలో కీలకమైన గుంటూరు జిల్లాలో వైకాపా భారీగా సీట్లు దక్కించుకుంది. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీకి కంచు కోటగా ఉన్న అసెంబ్లీ స్థానాలను కూడా ఈసారి వైకాపా గెలుచుకున్నారు. అలాంటి వైకాపా ఎమ్మెల్యేలు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండటం వల్ల ప్రతి సారి సీఎం వైఎస్ జగన్ కు తల నొప్పిగా మారుతుంది. గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలతో మరియు కింది స్థాయి పార్టీ కార్యకర్తలతో కలవలేక పోతున్నారు. సొంత ప్రచారం భారీగా చేసుకుంటూ ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ మరింతగా పార్టీకి డ్యామేజీ చేస్తున్నారు.
జగనన్నా ఒక్కసారి గుంటూరుపై ఫోకస్ పెట్టన్నా..
జిల్లాలోని ఒక మహిళ ఎమ్మెల్యే తీరు ఏమాత్రం సరిగా లేదు. ఆమె పదే పదే ఏదో ఒక వివాదంకు తెర తీస్తున్నారు. నియోజక వర్గంకు చెందిన పార్టీ నాయకులు వారిలో వారు కుమ్ములాడుకునేలా చేస్తున్నారు. ఆమె పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో విఫలం అవుతున్నారు. ఇంకా మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తూ ఆ పార్టీ నాయకులను నిరాశ పర్చుతున్నాడు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరులో మళ్లీ ప్రత్యర్థులు పాగా వేసే అవకాశం ఉంది. అందుకే వైకాపా నాయకులు సీఎం వైఎస్ జగన్ ను గుంటూరు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.