నన్నే ఆపి టోల్ ఫీజు చెల్లించమంటావా? రెచ్చిపోయిన వైసీపీ మహిళా నేత.. వీడియో వైరల్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

నన్నే ఆపి టోల్ ఫీజు చెల్లించమంటావా? రెచ్చిపోయిన వైసీపీ మహిళా నేత.. వీడియో వైరల్

ఒక్క వీడియో చాలు.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడానికి. వాళ్లు ఎంత పెద్ద తోపులైనా.. తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కితే చాలు.. క్షణాల్లో వాళ్ల ఫేమ్ అంతా నీరుకారిపోతుంది. దెబ్బకు వాళ్ల పాపులారిటీ తగ్గిపోతోంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి టోల్ ప్లాజా వద్ద రచ్చ రచ్చ చేశారు. గుంటూరు జిల్లాలో ఉన్న కాజా టోల్ ప్లాజా వద్ద […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 December 2020,12:01 pm

ఒక్క వీడియో చాలు.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడానికి. వాళ్లు ఎంత పెద్ద తోపులైనా.. తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కితే చాలు.. క్షణాల్లో వాళ్ల ఫేమ్ అంతా నీరుకారిపోతుంది. దెబ్బకు వాళ్ల పాపులారిటీ తగ్గిపోతోంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

YSRCP leader D Revathi slaps a toll plaza staff at Kaja Toll in Guntur district

YSRCP leader D Revathi slaps a toll plaza staff at Kaja Toll in Guntur district

ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి టోల్ ప్లాజా వద్ద రచ్చ రచ్చ చేశారు. గుంటూరు జిల్లాలో ఉన్న కాజా టోల్ ప్లాజా వద్ద ఆమె టోల్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు.

విజయవాడ వైపు వెళ్తున్న ఆమె టోల్ ప్లాజా వద్ద ఆగకుండా.. టోల్ ఫీజు చెల్లించుకుండా కారులో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. తన కారుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. దీంతో కోపోద్రికురాలైన రేవతి.. తన కారునే అడ్డుకుంటారా? తననే ఆపి టోల్ ఫీజు చెల్లించమంటారా? అంటూ కోపంతో ఊగిపోయి.. బారికేడ్లను తొలగించి.. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అనంతరం.. బారికేడ్లను పక్కకు నెట్టి ఆమె కారులో టోల్ ఫీజు చెల్లించకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది