YS Jagan : సీఎం కన్నా ఆ వైసీపీ ఎమ్మెల్యే బెస్ట్.. ఏపీ ప్రజలు ప్రశంసలు..!
YS Jagan : వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు కొన్ని విషయాల్లో సీరియస్ గా ఉండాలి. చూసీ చూడనట్టు వ్యవహరిస్తే కష్టం. ఎందుకంటే.. ఆయన కొన్ని అంశాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నారట. దాని వల్ల ముఖ్యమంత్రి పీఠానికే కలంకం వచ్చే అవకాశం ఉంది. నిజానికి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సూపర్బ్. ఆయన తీసుకొచ్చిన పథకాలు కూడా అద్భుతం. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో మాత్రం వైఎస్ జగన్ ఎందుకో వెనుకబడిపోతున్నారు.. అనే వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కరోనా విషయంలో ప్రస్తుతం ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఏపీలో సరైన వైద్య సౌకర్యాలు లేక చాలామంది కరోనా ట్రీట్ మెంట్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండటంతో చాలామంది కరోనా ట్రీట్ మెంట్ కోసం అంతదూరం నుంచి హైదరాబాద్ కు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
అయితే.. మొన్నటి వరకు పెద్దగా సమస్య లేదు కానీ.. తాజాగా సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు చేస్తున్న అత్యుత్సాహంతో ఏపీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. హైదరాబాద్ లో చికిత్స కోసం వెళ్లే ఏపీ కరోనా రోగులను సరిహద్దు వద్దే తెలంగాణ పోలీసులు ఆపేస్తుండటంతో ప్రస్తుతం ఏపీ మొత్తం తెలంగాణ మీద కోపంతో రగులుతోంది.
YS Jagan : ఇంకో మూడేళ్లు.. ఏపీకి హైదరాబాదే రాజధాని కదా
ఇంకో మూడేళ్ల వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్న విషయం తెలిసి కూడా ఏపీ ప్రజలపై తెలంగాణ పోలీసులు ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. తెలంగాణలో ఉన్న అన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడం, ఆక్సిజన్ల కొరత, బెడ్స్ కొరత, వెంటిలేటర్ల కొరత కూడా తెలంగాణలో తీవ్రంగా ఉండటంతో వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగులను ప్రభుత్వం సరిహద్దు వద్దే ఆపేస్తోంది.. అని కొందరు వాదిస్తున్నారు.
ఏది ఏమైనా తెలంగాణ పోలీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తున్నా.. సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో అస్సలు మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నాలనే సీఎం జగన్ చేయకపోవడంతో… ఏపీ ప్రజలు వైఎస్ జగన్ పై కోపంతో ఉన్నారట. అయితే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా రోగులపై ఇంత కక్ష కడుతారా? వాళ్లను తెలంగాణలోకి రానీయకుండా.. ఎలా అడ్డుకుంటారంటూ ప్రశ్నించారు. కేవలం జగ్గయ్యపేట ఎమ్మెల్యే తప్పితే.. మరే నాయకుడు కానీ.. మరే ఇతర వైసీపీ ఎమ్మెల్యే కానీ.. మంత్రి కానీ.. ముఖ్యమంత్రి కానీ.. ఈ విషయంపై స్పందించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.