Ysrcp : ఒక్క వీడియో తో ఆ మినిస్టర్ పదవి గోవిందా ? ఏపీ ని కుదిపేస్తోన్న వైరల్ వీడియో !

Ysrcp ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు నారాయణస్వామి. కాని సీఎం జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడారు.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రిపై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడటం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ గా మారి రచ్చ రచ్చవుతోంది.. ఇదిలా ఉంటే, నారాయణస్వామి అసలీ కామెంట్ ఎందుకు చేశారన్న చర్చ వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగామారింది. అసలు విషయానికి వస్తే.. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడింది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ రచ్చ సాగుతోంది. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పీకే మాట్లాడటంతో.. ఆయనకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. తమ స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్‌ ను టార్గెట్ చేయడంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేశారు. పవన్ పై ప్రజలే దాడి చేస్తారని అనబోయి.. నోరు జారారు. జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది.

Ysrcp MLA Narayana swamy coments on Ys jagan

Ysrcp ఏపీ సీఎం జగన్ పై దాడి..?

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. పవన్ పైన ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. పొరపాటున నోరు జారారు. పవన్ కళ్యాణ్ ను తిట్టబోయి తమ పార్టీ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరడం కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను దగ్గరకు కూడా రానివ్వలేదని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి జగన్ ను ఉద్దేశించి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నారాయణస్వామి ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తూ, జగన్ దాడి చేయడం ఏమిటి? ప్రజలే దాడి చేస్తారు.. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు రాబోతున్నాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పొరబాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వీడియో తెలుగు తమ్ముళ్ళ చేతికి చిక్కింది.

ys jagan

Ysrcp ఆట ఆడుకుంటున్న టీడీపీ, జనసేనలు

పవన్ కళ్యాణ్ ను అనబోయి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ లీడర్స్ లో జగన్ పై అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజు వస్తుందంటూ మనసులో మాట బయటపెట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Ysrcp MLA Narayana swamy coments on Ys jagan

ప్రజలే జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు వస్తాయని ఏడుకొండల వెంకన్న సాక్షిగా డిప్యూటీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారని ట్రోల్ చేస్తూ తెలుగు తమ్ముళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలను జనసేన, టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. జగన్ పై ప్రజలు దాడి చేయడం ఖాయమని, వైసీపీ నేతలే ఈ విషయం చెబుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago