Roja : ఆ అర్హత చంద్రబాబు, లోకేష్‌ కు లేదు.. టీడీపీ కి కొత్త అర్థం చెప్పిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : ఆ అర్హత చంద్రబాబు, లోకేష్‌ కు లేదు.. టీడీపీ కి కొత్త అర్థం చెప్పిన రోజా

Roja : మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు వారికి లేదని, మహిళా సాధికారత అంటే ఏంటో మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 March 2022,7:00 am

Roja : మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు వారికి లేదని, మహిళా సాధికారత అంటే ఏంటో మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని రోజా పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క సారి కూడా మహిళా సాధికారత గురించి కానీ మహిళల గురించి కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో మహిళలపై అకృత్యాలు అఘాయిత్యాలు అత్యంత దారుణంగా జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మహా రాణులు గా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఆమె తెలియజేశారు.

ysrcp mla roja punch dialogues chandrababu naidu

ysrcp mla roja punch dialogues chandrababu naidu

చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నాయకులు దుశ్యాసనులుగా వ్యవహరించారని రోజా విమర్శించారు. నారా వారి పాలన నరకాసురుని పాలన అంటూ వారి పరిపాలన సమయంలో జరిగిన సంఘటనలతో నిరూపితమైంది. మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితిని వారి పరిపాలనలో ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను మహిళల కోసం ప్రవేశ పెట్టారు అంటూ రోజా కామెంట్ చేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది