ysrcp mla roja punch dialogues chandrababu naidu
Roja : మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు వారికి లేదని, మహిళా సాధికారత అంటే ఏంటో మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని రోజా పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క సారి కూడా మహిళా సాధికారత గురించి కానీ మహిళల గురించి కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో మహిళలపై అకృత్యాలు అఘాయిత్యాలు అత్యంత దారుణంగా జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మహా రాణులు గా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఆమె తెలియజేశారు.
ysrcp mla roja punch dialogues chandrababu naidu
చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నాయకులు దుశ్యాసనులుగా వ్యవహరించారని రోజా విమర్శించారు. నారా వారి పాలన నరకాసురుని పాలన అంటూ వారి పరిపాలన సమయంలో జరిగిన సంఘటనలతో నిరూపితమైంది. మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితిని వారి పరిపాలనలో ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను మహిళల కోసం ప్రవేశ పెట్టారు అంటూ రోజా కామెంట్ చేశారు.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.