
Ysrcp
YSRCP పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరును కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ TDP కేవలం 3 సీట్లకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు. ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి.
అందులో మూడు సీట్లను ఎన్నికలను ముందే వైసీపీ YSRCPఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇవాళ 47 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. తుది ఫలితాలు కలిపి, వైసీపీ YSRCP మొత్తం 47 డివిజన్లను గెలుచుకోగా, టీడీపీ TDP కేవలం 3 డివిజన్లలోనే సత్తా చాటుకుంది. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారని వైసీపీ నేతలు చెప్పారు. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ గెలుపు ఊహించిందే అయినప్పటికీ, టీడీపీ అంతో ఇంతో పోటీ ఇస్తుందని, గుంటూరు, విశాఖపట్నం మాదిరిగా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ చివరికి 3 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుంది. 28, 37, 47వ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
Ysrcp
రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీ YSRCP తన మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న వైసీపీ.. మేయర్ అభ్యర్థిపై కసరత్తును ప్రారంభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంతూరైన ఏలూరులో మేయర్ పదవి కోసం చాలా మందే కాసుక్కూర్చున్నారు.
YS Jagan
వారిలో ఎవరికి పదవి ఇచ్చినా.. మిగిలిన వారు అలిగి కూర్చునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఒక్క చోట కూడా కనిపించని విధంగా ఇక్కడ ఏకంగా ఐదుగురికి మేయర్ పదవిని ఇవ్వనున్నామని అప్పుడెప్పుడో ఆళ్ల నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన మేయర్ పదవిని ఐదుగురికి పంచాలంటే.. ఏడాదికో మేయర్ మారాల్సిందేనన్న మాట. ఎంపికైన వారు ఏడాది తిరక్కుండానే పదవిని అంత ఈజీగా ఎలా వదులుతారోనన్న విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.