YSRCP : వైసీపీకి కష్టాలు మొదలయ్యాయా? తొలిసారి పార్టీకి ఎదురుదెబ్బ?

YSRCP : రాజకీయంగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీని ఎదుర్కునే పార్టీ అయితే ఇప్పట్లో లేదు. రాజకీయంగా ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. 2019 లో సాధారణ ఎన్నికల తర్వాత మళ్లీ రెండేళ్లకు ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించింది. వైఎస్సార్సీపీ పార్టీకి తిరుగులేదు అని మరోసారి నిరూపించుకుంది. తిరుపతి ఉపఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలని పార్టీ తీవ్రంగా కృషి చేసింది. ఇంకా తిరుపతి ఉపఎన్నిక రిజల్ట్స్ రాకున్నా… వైసీపీకే అక్కడ అనుకూలంగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏంటంటే… ఎన్నిక ఏదైనా… గెలుపు మాత్రం వైసీపీదే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ టైమ్ లో వైసీపీని ఢీకొట్టే పార్టీ అయితే లేదు.

ysrcp party leaders to join in tdp

అయితే… అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతుంటాయి.. బండ్లు ఓడలు అవుతుంటాయి. 2014 లో టీడీపీ గెలిచి… వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుంటే… 2019లో వైసీపీ గెలిచి టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. అంటే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. రాత్రికి రాత్రే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అవును.. ఏదైనా.. ఒక్కరోజులో ప్రభుత్వాలే కూలిపోయిన రోజులను చూశాం మనం. గత రెండేళ్ల నుంచి చూస్తే ఏపీ ప్రజలు ప్రస్తుతానికి వైసీపీ వెంటనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీనే గెలిపిస్తున్నారు. అంతవరకు ఓకే కానీ.. భవిష్యత్తులో 2024 ఎన్నికల్లోపూ వైఎస్సార్సీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు.. అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

YSRCP : ఎప్పటికైనా వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే

ఏపీలో ఇప్పుడే కాదు… ఎప్పటికైనా వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే… ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీలను దాటుకొని ముందుకు వచ్చే పార్టీ ఏదీ లేదంటున్నారు. బీజేపీ ఏపీలో బలపడినట్టు కనిపించినా.. బీజేపీకి అంత సీన్ లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో మోదీ వేవ్ తో బీజేపీ బలంగా కనిపిస్తోంది కానీ… బీజేపీకి ఏపీలో అంత బలం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక.. జనసేన పార్టీ గురించి చెప్పాలంటే అసలు పార్టీ నిర్మాణమే లేదు.. పార్టీ అధ్యక్షుడు పార్టీ కంటే… వేరే పార్టీల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. జనసేన పార్టీ ఇప్పట్లో బలపడే అవకాశం లేదంటున్నారు.

ఇక మిగిలింది టీడీపీనే. రెండేళ్ల క్రితం వరకు ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ. దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ. ఏపీలో చాలాసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. టీడీపీకి ఇప్పుడు బలం లేకపోవచ్చు గాక… కానీ… 2024 ఎన్నికల్లోపు టీడీపీ బలం అంతకంతకూ పెరుగుతూ పోతుందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలో ప్రస్తుతం అంతర్గత పోరు నడుస్తోందని.. అసంతృప్తితో ఉన్న నాయకులు…. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకులు.. మళ్లీ టీడీపీ గూటికి వెళ్లడం ఖాయం అంటున్నారు. వైసీపీకి కష్టాలు ప్రారంభం అయ్యాయని.. దానికి నిదర్శనమే పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు అని అంటున్నారు.

Share

Recent Posts

Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండ‌ర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో ప‌డ‌లేదా.. కార‌ణం ఏంటంటే..!

Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…

31 seconds ago

Monalisa : మోనాలిసా మోస‌పోలేదు.. స్పెష‌ల్ సాంగ్‌తో ఎంట్రీ

Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ‌ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…

1 hour ago

Rains : రెయిన్ అల‌ర్ట్.. మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలే వ‌ర్షాలు

Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…

2 hours ago

Unripe Lychees : పండని లీచీ పండ్ల‌ను తినకూడదు, ఎందుకంటే ?

Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…

7 hours ago

Drumstick Leaves : మునగ ఆకులు.. మీరు తెలుసుకోవాల్సిన ఆరోగ్య‌ ప్రయోజనాలు

Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…

8 hours ago

Soaked Groundnuts : ధ‌ర ఎక్కువ‌ని బాదం తిన‌డం లేదా? అయితే గుండె ఆరోగ్యానికి ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టి తినండి

Soaked Groundnuts : వేరుశెన‌గ‌ల‌ను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి శోషణను మెరుగుపరచడం మరియు కొన్ని యాంటీ-న్యూట్రియెంట్లను తొలగించడం ద్వారా…

9 hours ago

Mango : ఈ పండు రసం, కాయ, ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు

Mango : పండ్ల‌లో రాజు మామిడి. అటువంటి మామిడిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా చేసి పాలతో కలిపి…

9 hours ago

Cinnamon To Milk : పాలలో చిటికెడు ఈ సుగంధ ద్రవ్యం పొడి కలుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

Cinnamon To Milk : రాత్రిపూట పాలు తాగడం తరచుగా ఆరోగ్యకరమైన అలవాటుగా పరిగణించబడుతుంది. రోజువారీ కాల్షియం అవసరాలను తీర్చడంలో…

11 hours ago