Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి.. మొదలు అవ్వకుండానే అట్టర్ ఫ్లాప్..!
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు ఏళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రమంతా పర్యటించడానికి.. ఎన్నికల ప్రచారం కోసం జనసేన, Janasena, అధినేత పవన్ కళ్యాణ్, Pawan Kalyan, సపరేట్ గా ఒక వాహనాన్ని తయారు చేయించారు. దానికి వారాహి అనే పేరు పెట్టారు. కొత్త వాహనం ఫోటోను రివీల్ చేయగానే ఆ ఫోటోపై పలు ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఆ వాహనంపై చాలా విమర్శలు చేశారు.
సోషల్ మీడియా,Social media, వేదికగా అందరూ ఆ వాహనంపై విమర్శలు గుప్పించారు.అది వారాహి కాదు.. నారాహి అంటూ మంత్రి రోజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. చివరకు ఆ వాహనం రంగు విషయంలోనూ పెద్ద రచ్చ చేశారు. అది ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉందని.. అది భారత ఆర్మీ రంగు అని.. ఆ రంగుతో ఏ వాహనాలు ఉండకూడదని కొత్త జోస్యం చెప్పారు. దానికి రిజిస్ట్రేషన్ కాదని.. ట్రాన్స్ పోర్ట్ రూల్స్ కూడా జనసేనానికి తెలియదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ వాహనానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది.
Pawan Kalyan : తెలంగాణలో ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
దాని రంగు విషయంలోనూ తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ వాహనానికి టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ ను కేటాయించారు. ఆ నెంబర్ కూడితే 23 వస్తుంది అని.. అంటే అది Chandrababu,చంద్రబాబుకు ఇష్టమైన నెంబర్ అని మరో కొత్త కోణాన్ని బయటికి తీశారు వైసీపీ నేతలు. ఇన్ని రోజులు రంగు గురించి రచ్చ.. ఇప్పుడు నెంబర్ గురించి రచ్చ.. ఇలా ప్రతి విషయంలో కావాలని వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారంటున్నారు. వైసీపీ,YCP, నేతల కౌంటర్ కు వెంటనే గట్టిగా కౌంటర్ వేస్తున్నారు జనసేన నేతలు. అసలు వైసీపీ,YCP, నేతలకు ఏం తెలియదని.. కేవలం హడావుడి మాత్రమే చేస్తారంటూ జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.