YS Jagan : తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు కదా. తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చకపోవడంతో సిట్టింగులంతా ఓడిపోవడం జరిగింది. అందులో ఎక్కువ శాతం మంత్రులే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో చివరకు తనకు అధికారమే దూరమైంది. కేవలం 39 సీట్లతో బీఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్ లను మార్చిన 9 నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు గెలిచారు. సిట్టింగ్ ల మీద నియోజకవర్గ స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీఆర్ డేర్ స్టెప్ వేశారు. కానీ.. మూడో సారి అధికారంలోకి రాలేకపోయారు. ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ చెప్పిన తప్పును ఏపీలో వైఎస్ జగన్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ కేసీఆర్ చేసిన తప్పునే జగన్ కూడా చేస్తే.. 2024 ఎన్నికల తర్వాత జగన్ కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. అందుకే 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు సీఎం జగన్. ఏపీలో ఉన్నది 175 నియోజకవర్గాలు. అందులె 150కి పైగా వైసీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 62 మంది సిట్టింగ్ లను ఖచ్చితంగా మారుస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 11 స్థానాల్లో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకే వేరే నియోజకవర్గాన్ని అప్పగించారు. ఇక.. 62 స్థానాల్లో సిట్టింగ్ లను లేపేసి కొత్త వారికి, లేదా ఇతర నాయకులకు జగన్ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికలో పడింది హైకమాండ్. అయితే.. ఒక్కసారిగా 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకపోవడం అనేది ఎంత మేరకు వర్కవుట్ అవుతుంది అనేది మాత్రం తెలియదు. మరోవైపు తనకు ఎంతో సన్నిహితుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డినే కాదని బీసీకే టికెట్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారంటే.. ఎవ్వరు ఏం అనుకున్నా.. ఎవ్వరు ఫీల్ అయినా కాకున్నా.. ఎవరు రెబల్ గా మారినా.. ఇంకేం చేసినా కూడా 62 చోట్ల మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులను మారుస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా జగన్ అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారు. ఆ సర్వేలో ఎమ్మెల్యేలకు పాజిటివ్ గా రిపోర్ట్ వస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ సర్వేలో పాజిటివ్ రాకపోతే ఆ స్థానంలో వేరే నేతకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లినా.. వాళ్లు ఏం చేసినా కూడా జగన్ లెక్కచేసేది లేదని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.