Watchman TO Millionaire
Watchman TO Millionaire : కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎంతటి వారైనా కోటీశ్వరులు అవుతారు అనేది ఇందుకు నిదర్శనం. బీహార్ కి చెందిన దిగ్విజయ్ పాండే 18 ఏళ్ళ వయసులో ముంబైకి వచ్చాడు. తల్లిదండ్రులకు పెద్దగా ఆస్తులు లేకపోవడంతో అతను పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దిగ్విజయ్ పదివేల రూపాయలతో ముంబైకి వచ్చాడు. పని కోసం వెతికాడు కానీ చివరికి తనకు ఏ పని నచ్చక పోవడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు. తను తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో ఏదో ఒక పని చేయాలని ధనవంతుల ఇంటి ముందు వాచ్మెన్ గా చేరాడు. ఆ సమయంలో ముంబైకి వరదలు వచ్చాయి. ఓనర్ మంచి వాడు కావడంతో దిగ్విజయ్ కి భోజనం పెట్టేవాడు. ఆ ఇంటి ఓనర్ పిల్లలతో సహా అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారు. దిగ్విజయ్ కూడా తనకు వచ్చిన ఇంగ్లీష్ ను మాట్లాడేవాడు. అప్పుడే తనకు ముంబైలో బ్రతకాలంటే ఇంగ్లీష్ రావాలి అనే విషయం అర్థమైంది.
రోజు ఇంగ్లీష్ పేపర్ చదివి నేర్చుకునేవాడు. ఇంగ్లీషు పూర్తిగా మాట్లాడడం వచ్చాక వాచ్మెన్ ఉద్యోగం వదిలేసి పేపర్లో వచ్చిన ప్రకటన చూసి మారుతి కార్ షోరూమ్ లో సేల్స్ మాన్ ఉద్యోగం పొందాడు. ఇంటర్వ్యూ ఇంగ్లీషులో కానీ అతడికి డిగ్రీ లేదు. అయిన డిగ్రీ చదివానని చెప్పాడు. తనకున్న మాటకరితనంతో ఇంగ్లీషులో మాట్లాడి ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. సర్టిఫికెట్స్ అడిగితే ముంబై వరదల్లో కొట్టుకొని పోయాయని, తనకు ఇంటికి వెళ్లి తెచ్చుకొని శక్తి లేదని, పేదవాడిని అని చెప్పాడు. రిక్వెస్ట్ చేసి జాబ్ కొట్టేసాడు. తర్వాత డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. కార్ సేల్స్ లో ఏడేళ్ల ఎక్స్పీరియన్స్ పొందాడు. మంచి ప్రమోషన్ కూడా పొందాడు. ఆ తర్వాత పేపర్లో ప్రకటన చూసి బెంజ్ కార్ కంపెనీకి హెడ్ ఆఫీస్ లో జాబ్ పొందాడు. నెలకు రెండున్నర లక్షల ఉద్యోగం సంపాదించాడు.
ఇక 2020 తర్వాత యువకులంతా స్టార్ట్ అప్ యాప్ లు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో దిగ్విజయ కూడా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా కూరగాయలను కట్ చేసుకోవడం పెద్ద పనిగా మారింది. దీన్నే దిగ్విజయ్ వ్యాపారంగా మార్చుకున్నాడు. ముందుగా తన ఫ్లాట్లోనే ఇద్దరు ఆడవాళ్లను పనిలో పెట్టుకొని కూరగాయలు కట్ చేపించి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగుతుండడంతో దానికి యాప్ ను కూడా డెవలప్ చేశాడు. కట్ చేసిన కూరగాయలను పండ్లను అమ్ముతూ బిజినెస్ 50 లక్షల టర్నో వర్ కి ఎదిగేలా చేశాడు. స్విగ్గి, జొమాటో కార్డ్స్ తో ఆన్లైన్లో అమ్మటం ప్రారంభించాడు. ఇక సంవత్సరం ఆదాయం రెండు కోట్లకు చేరింది. ప్రస్తుతం అతడి వ్యాపారం ఐదు కోట్లకు మారింది. ఇతర రాష్ట్రాలలో కూడా తన బిజినెస్ ని పెట్టాలని దిగ్విజయ్ అనుకుంటున్నాడు. ఇలా దిగ్విజయ్ వాచ్మెన్ ఉద్యోగం నుంచి కోట్లు సంపాదించే బిజినెస్ మాన్ గా మారాడు.
Agarbatti Sticks : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పూజ గదిలో అగరవత్తులను వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే,మీరు…
Varalakshmi Vratam : శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వనవాసం వస్తుంది అంటేనే మహిళలకు ఎంతో…
India Vs pakistan : asia cup 2025 క్రికెట్ Cicket అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్…
Good News : గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (National Livestock Mission)…
BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది.…
YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత,…
Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్…
Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…
This website uses cookies.