Bus Tickets : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త… బస్ టికెట్లపై భారీ తగ్గింపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bus Tickets : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త… బస్ టికెట్లపై భారీ తగ్గింపు..!

Bus Tickets : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున ఆయా ప్రభుత్వాలు అనేక ఆఫర్స్ డిస్కౌంట్ ని అందిస్తూ వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊర్లకు దూరంగా ఉంటున్న వారి కోసం కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాలలో పలు సంస్థలు బస్సు ఆక్యుపేన్షిని పెంచేందుకు అనేక రకాల డీల్స్ ని డిస్కౌంట్స్ పెడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రైవేట్ సంస్థలు ఆర్టీసీ బస్ టికెట్లపై రాయితిని కూడా అందిస్తుంటాయి. […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2024,3:00 pm

Bus Tickets : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున ఆయా ప్రభుత్వాలు అనేక ఆఫర్స్ డిస్కౌంట్ ని అందిస్తూ వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊర్లకు దూరంగా ఉంటున్న వారి కోసం కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాలలో పలు సంస్థలు బస్సు ఆక్యుపేన్షిని పెంచేందుకు అనేక రకాల డీల్స్ ని డిస్కౌంట్స్ పెడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రైవేట్ సంస్థలు ఆర్టీసీ బస్ టికెట్లపై రాయితిని కూడా అందిస్తుంటాయి. ఇక ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువచ్చేందుకు కొన్ని సంస్థలు ఉత్సాహంగా పనిచేస్తుంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఓటింగ్ శాతం పెంచేందుకు అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పలు ప్రైవేట్ సంస్థలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.

Bus Tickets : ఓటు వేయడానికి ఊర్లకు వెళ్లే వారికి డిస్కౌంట్…

ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఓటు వేసిన వారికి ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జరిగిన బెంగళూరు ఎన్నికల్లో రాపిడో సంస్థ కూడా ఫ్రీ రైడ్స్ ని కల్పించింది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు , వికలాంగులు వంటి వారిని ఓటు వేపించడానికి పోలింగ్ బూత్ కి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి పంపేందుకు రాపిడో బైక్ ఉచితంగా చర్యలు చేపట్టింది. ఈ విధంగా ప్రభుత్వాలు ఎలాగైనా ఓట్ల శాతం పెంచేందుకు అందరితో ఓట్లు వేయించాలనే ఆలోచనతో వినూత్న పద్ధతులను ఎంచుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలు ఓటర్ల కోసం కొత్త ఆఫర్లు తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ అభిబస్ ఓటర్ల కోసం కొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Bus Tickets రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త బస్ టికెట్లపై భారీ తగ్గింపు

Bus Tickets : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త… బస్ టికెట్లపై భారీ తగ్గింపు..!

ఈ నేపథ్యంలోనే ఓటు వేయడానికి సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు చార్జీలపై ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లుగా ఇటీవల అభిబస్ సీఈవో లెనిన్ కోడూరు , సిఓఓ రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే మే 13 నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్లు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్లేటువంటి ప్రయాణికులకు అభి బస్సులో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ABHIVOTE కూపన్ కోడ్ అందుబాటులో ఉంచింది. ఇక ఈ కూపన్ కోడ్ తో మీరు మీ టికెట్ పై కనీసం 20% గరిష్టంగా రాయితీ పొందవచ్చు. అంటే దాదాపు 250 రూపాయలు వరకు మీకు రాయితీగా లభిస్తుంది. అంతేకాక అదనంగా ₹100 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ఇక ఈ ఆఫర్ ని ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ వినియోగించుకోవచ్చని అభిబస్ యాజమాన్య సంస్థ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం అభిబస్ అందుబాటులో ఉంచిన ఈ ఆఫర్ ను మీరు కూడా ఉపయోగించుకోండి. దీనిని షేర్ చేసి మరింత మందికి తెలిసేలా చేయండి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది